సమంత రూత్ ప్రభు 12 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలోను నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. నాగ చైతన్య తో విడాకుల తర్వాత తన సినీ కెరీర్లో చాలా బిజీ అయిపోయింది సమంత. షూటింగ్స్ మాత్రమే కాకుండా బిజినెస్ వెకేషన్ కూడా వెళుతూ తన లైఫ్ లో మరింత ముందుకు వెళ్తోంది. అయితే నాగ చైతన్య తో విడాకులకు రీసన్ ఏమిటి అనేది బయటకు రాకపోవడంతో, ఇందులో సమంత తప్పు చాలా ఉందని ముందు నుంచి రూమర్స్ వినిపిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.
Advertisement
సోషల్ మీడియాలో అయితే సమంత మీద మామూలుగా ట్రోల్స్ రావడం లేదు. అయితే ఈ మధ్య ఆమె తన డాగ్ తో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో ని చూసి ఒక నెటిజన్ పెట్టిన కామెంట్, దానికి బదులుగా సమంత ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సదరు నెటిజన్ తాను చివరికి కుక్కలు మరియు పిల్లలతో ఒంటరిగా చచ్చిపోతుంది అని అంటూ కామెంట్ చేశాడు.
Advertisement
He deleted and ran away 😂
This was the tweet 👇 pic.twitter.com/H7YZAPmVVC
— SARAVAN (@Saravan_2255) May 27, 2022
ఆ కామెంట్ కి సమంత అలా జరిగితే మాత్రం నేను చాలా లక్కీ అని అంటూ డిఫరెంట్ స్టైల్ లో రిప్లై ఇవ్వడంతో ఆ కామెంట్ పెట్టిన నెటిజన్ వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. సమంత ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏది ఏమైనా సమంత ఓ వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డిఫరెంట్ ఆక్టివిటీస్ చేస్తూ ఫ్యాన్స్ అందరిని అలరిస్తూనే ఉంది. ఇక కామెంట్ల విషయంలో అయితే తనదైన శైలిలో రిప్లై ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అని చెప్పవచ్చు.
ALSO READ;
ఒక్కో ఇంటర్వ్యూకు బిత్తిరి సత్తి ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడో తెలుసా..!
25 ఏళ్లుగా హీరో వెంకటేష్ రోజా మధ్య మాటలు లేకపోవడానకి కారణం అదేనా..?