మానవ శరీరంలో ద్రవపదార్థ సమ్మేళనానికి విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలకు సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. నీరు బాగా తాగటం ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నీరు తాగడం వల్ల గరిష్ట ప్రయోజనాలు ఏ సమయంలో ఎంత నీరు త్రాగితే పొందుతారో తెలుసా.. ప్రతిరోజూ కనీసం 10 నుండి 12 గ్లాసుల నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే చల్లటి నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.మీరు ఉదయాన్నే మేల్కొన్న తక్షణమే ఒకటి, రెండు గ్లాసుల నీళ్లు తాగాలని ఒక నియమం పెట్టుకోండి. ఇది శరీరంలోని అవయవాలను ఉత్తేజపరిచి శరీరంనుంచి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలని అనుకొనే వారికి సరైన మార్గం గోరు వెచ్చని నీరు త్రాగడం. ఇది జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల అధిక బరువు పెరగకుండా ఉంటుంది. భోజనానికి ముందు నీరు త్రాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిది. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటారో వారికి ఆహారానికి ముందు నీరు త్రాగడం చాలా ఉపయోగపడుతుంది. మరోవైపు ఆహారం తీసుకున్న ఒక అరగంట తర్వాత నీరు తాగడం వల్ల తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరంలోకి శోచించబడతాయి. శరీరంలో నీటిశాతం సరిగ్గా లేకపోతే చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు వంటివి ఏర్పడడం జరుగుతాయి. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ప్రతి రోజు మంచి నీరు త్రాగడం వల్ల చర్మ మరియు చర్మ రంద్రాలు క్లీన్ చేసి కోమలమైన చర్మాన్ని అందిస్తుంది. మరియు చర్మాన్ని మృదువుగా,తేమగా ఉంచుతుంది.
Advertisement
ALSO READ;
Advertisement
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే..?
ఒకే ప్రేమ్ లో టాప్ హీరోయిన్లు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?