మీరు రెగ్యులర్ రైలులో ప్రయాణిస్తున్నారా..? మీరు ప్రయాణించే రైలు బోగీ ఏ కలర్లో ఉంటుంది..? రైల్లు, రెడ్, గ్రీన్ కలర్స్‌లో కనిపిస్తుంటాయి. వీటికి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆసియాలోనే రెండవ అతిపెద్ద ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన భారతీయ రైల్వే దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రైళ్లు నడుపుతుంటుంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలు బోగీల రంగులు వేర్వేరుగా ఎందుకు ఉంటాయని ఆలోచించే వారు తక్కువగానే ఉంటారు. రైలు బోగీలు ఆ రైలు మోడల్ని తెలియజేస్తుంటాయి. వాటి రంగులు వేర్వేరుగా ఉంటాయి.
లు బోగీలు అధికంగా బ్లూ కలర్లో అనగా నీలిరంగులో ఉంటాయి. ఈ బోగీలను ఇంటిగ్రెటెడ్ కోచ్‌లో లేదా ఐసీఎఫ్ కోచ్‌లు అంటారు. ఈ రైళ్ల వేగం గంటకు 70 కిలోమీటర్ల నుండి 140 కి.మీ. మధ్య ఉంటుంది. ఈ బోగీలు మెయిల్ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇనుముతో తయారు చేసిన బోగీలు ఇవి. ఎయిర్ బ్రేకులతో అమర్చబడి ఉంటాయి. భారతీయ రైల్వే ఎరుపు రంగు కోచ్‌లతో పలు రైళ్లను నడుపుతోంది. ఈ రైలు బోగీలను లింగ్ హాఫ్మన్ బుష్ అంటే ఎల్‌హెచ్‌బీ కోచెస్ అంటారు. జర్మనీ నుండి ఈ బోగీలు 2000 సంవత్సరంలో వచ్చాయి. గతంలో ఈ బోగీలు వేర్వేరు దేశాల్లో తయారయ్యేవి. ప్రస్తుతం పంజాబ్‌లోని కపుర్తలాలో భారతీయ రైల్వే సంస్థ తయారు చేస్తోంది. ఇవి అల్యూమినియడంతో తయారవుతాయి. బరువు తక్కువ. డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. బోగీల బరువు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. రాజధాని, శతాబ్ది రైళ్లల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలు చూడవచ్చు.
Advertisement
Advertisement
గ్రీన్ కలర్ బోగీలు గరీబ్ రథ్ రైళ్లకు కనిపిస్తాయి. మీటర్ గేజ్ రైళ్లకు గోధుమ రంగు బోగీలు ఉంటాయి. నారో గేజ్ రైళ్లు కూడా ఇదే కలర్లో ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో నారో గేజ్ రైళ్లు దాదాపుగా లేనట్టే. రంగులు కాకుండా ఐసీఎఫ్ కోచ్‌లపై పలు రంగులతో గీతలుంటాయి. కొన్ని కోచ్‌లలో చివరి విండోను గుర్తించేందుకు ఈ గీతలను పేయింట చేస్తారు. ఇవి నీలి రంగు రైల్వే కోచ్‌లపై తెల్లని చారలు కనిపిస్తుంటాయి. అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ బోగీలను గుర్తించడానికి ఇవి ఉంటాయి. ఆకుపచ్చ చారలతో ఉన్న బూడిద రంగు కోచ్‌లు మహిళలకు మాత్రమే అని సూచిస్తాయి. గ్రే కోచ్‌లపై ఎరుపు గీతలు రైళ్లలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్లను సూచిస్తాయి. ముంబై లోకల్ రైళ్లకు పశ్చిమ రైల్వే ఇదేవిధంగా గీతలను ఉపయోగిస్తుంది. రైలుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులు అర్థం చేసుకోవడానికి భారతీయ రైల్వే ఉపయోగించే అనేక గుర్తుల్లో గీతలు ఒకటి.