పోలీస్ స్టోరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి సాయికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. రామానాయుడు, ఎస్వీకృష్ణారెడ్డి, ఆర్.నారాయణమూర్తి, మురళీ మోహన్ చెప్పారు. ఇవన్నీ చేస్తూనే ఎవరైనా పెద్ద హీరో చెబితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడు వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నేను గాజుల నాగేశ్వరరావు కలిసి వెళ్లాం. నాగబాబు సమయానికి అక్కడే ఉన్నారు. కంగ్రాట్స్ రా మీ సినిమా అక్కడ పెద్ద హిట్ అంట కదా. నేను లోపలికి వెళ్లాను. కానీ నాగేశ్వరరావు బయటే ఉన్నారు. సాయికుమార్ అన్నయ్య నచ్చితే చెప్పండి. లేకపోతే వద్దు అన్నాను. అప్పుడు సరే చూద్దాం అన్నారు చిరంజీవి.
అప్పుడు చిరంజీవి హైదరాబాద్ కు వెళ్తున్నానని చెప్పడంతో.. నేను హైదరాబాద్ కు వస్తున్నానని ప్రింట్ తీసుకొని వచ్చినట్టు చెప్పారు సాయికుమార్. ఆ ప్రింట్‌ను చాలా రోజుల తరువాత చూసే అవకాశం దక్కింది. రామానాయుడు, ఎస్వీకృష్ణారెడ్డి, పరిచూరి బ్రదర్స్ వీరందరూ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఉన్నారు. ప్రింట్ ఒకటే అప్పుడు. ఆ ప్రింట్‌ను సురేష్ థియేటర్‌లో బుక్ చేశాం. అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి మేనేజర్ ఫోన్ చేసి సినిమా చూస్తానని చెప్పాడని వెల్లడించాడు. మెగాస్టార్ దంపతులిద్దరూ కలిసి పోలీస్టోరీ సినిమాను చూశారట. ఆ సమయంలో చిరంజీవి సినిమా షూటింగ్ కు వెళ్లి వచ్చి సినిమా చూశాడు. ముందు వరుసలో కూర్చుని మరీ సినిమా చూసాడు. ఆ సమయంలో సినిమా ప్రింట్లు మారుతుండేవి.
Advertisement
Advertisement
ప్రింట్స్ మార్చే తరుణంలో ఒకసారి ఆలస్యం కావడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సమయంలో చిరంజీవి ఆవేశంగా ఒక్కసారిగా లేచి సినిమా ఎందుకు ఆగిపోయిందని గట్టిగా అరిచాడు. అప్పుడు అక్కడే ఉన్న సాయికుమార్ ప్రింట్ ప్రాబ్లమ్ వల్ల ఆగిపోయిందని సమాధానం చెప్పాడు. ఇక సినిమా చూసిన వెంటనే చిరంజీవి గారికి సినిమా నచ్చి మీడియాను పిలిపించండి సినిమా గురించి మాట్లాడుతాను అని చెప్పారు. ఇక ఆ సమయంలో ఇక నాగేశ్వర్‌రావు మెగాస్టార్ చిరంజీవి అలా చెప్పడంతో సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా పోలీస్ స్టోరీ సినిమాకు చిరంజీవి హెల్ప్ చేశారు.
Also Read :
ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఇన్ని అవమానాలు ఎదుర్కున్నాడా.?
పుట్టిన రోజు పార్టీలో మెరిసిన రష్మిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!