Home » పుట్టిన రోజు పార్టీలో మెరిసిన ర‌ష్మిక‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..!

పుట్టిన రోజు పార్టీలో మెరిసిన ర‌ష్మిక‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..!

by Anji
Published: Last Updated on
Ad

శాండిల్ వుడ్ నుంచి రంగ‌ప్ర‌వేశం చేసిన స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. ఒక వైపు ద‌క్షిణాన స్టార్ హీరోయిన్‌లతో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ సొగ‌స‌రి రీసెంట్‌గా బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ పుట్టిన రోజు పార్టీకి హాజ‌రు అయింది. ద‌క్షిణాది నుంచి ఆహ్వానం అందుకున్న అతికొద్ది మంది సినీ సెల‌బ్రిటీలో ర‌ష్మిక మంద‌న్న ఒక‌టి. పార్టీకి బ్లాక్ డ్రెస్‌లో హాజ‌రు కావాల‌నేది కోడ్‌గా పెట్టుకున్నారేమో. అంద‌రూ బ్లాక్ డ్రెస్సులోనే హాజ‌రు అవ్వ‌డం విశేషం.

Advertisement

అంద‌రి మాదిరిగానే ర‌ష్మిక బ్లాక్ డ్రెస్ వేసుకుని వ‌చ్చింది. ఆమె వేసుకొచ్చిన డ్రెస్ థైస్ క‌నిపించే విధంగా ఉండ‌డంతో ఫోటోల ముందు ఫోజులివ్వ‌డానికి ఇబ్బంది ప‌డింది. పెద్ద‌గా ఫోటోలు తీయ‌నీయ‌లేదు. మాటిమాటికి డ్రెస్‌ను ప‌ట్టుకుంటూ క‌నిపించింది. దీంతో నెటిజ‌న్లు ర‌ష్మిక మంద‌న్న‌ను ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. అస‌లు ఇబ్బందిగా అనిపించిన‌ప్పుడు ముందుగానే తెలియ‌లేదా..? తెలిసిన‌ప్పుడు అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావ‌ని కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రూ మాత్రం బ్లాక్ డ్రెస్‌లో ర‌ష్మిక మంద‌న్న ఓ దేవ‌త‌లా ఉందంటూ కామెంట్స్ చేసారు.

ఈ సినిమాల విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న తెలుగు, త‌మిళ భాష‌ల్లో కోలీవుడ్ అగ్ర క‌థానాయకుడు విజ‌య్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తుంటే ఈ చిత్రాన్ని దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా పాన్ ఇండియా మూవీగా అల్లుఅర్జున్‌- సుకుమార్ కాంబోలో రూపొంద‌నున్న పుష్ప ది రూల్ చిత్రంలో ర‌ష్మిక న‌టించ‌నున్న‌ది. ఇవే కాకుండా.. బాలీవుడ్ లో అమితాబ‌చ్చ‌న్ తో గుడ్ బై సినిమా సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో మిష‌న్ మ‌జ్ఞు ర‌ణ‌బీర్ క‌పూర్ తో యానిమ‌ల్ సినిమాల‌లో న‌టిస్తోంది.

Visitors Are Also Reading