Home » పెళ్లికాని వ్యక్తుల్లో గుండె వైఫల్యం ఎక్కువ అవుతోందా.. ఆ పరిశోధనలో ఏం తేలింది..?

పెళ్లికాని వ్యక్తుల్లో గుండె వైఫల్యం ఎక్కువ అవుతోందా.. ఆ పరిశోధనలో ఏం తేలింది..?

by Sravanthi
Ad

ఇప్పటివరకు గుండె వైఫల్యం చెంది మరణించడానికి చాలా కారణాలు ఉన్నాయి.కానీ మరో కొత్త కారణం వచ్చి చేరింది. ఇందులో ఎక్కువగా పెళ్లి కాని యువకులు లేదా పెళ్లి అయి విడాకులు తీసుకున్నవారే ఉన్నారట. కొత్తగా తేలిన పరిశోధన ప్రకారం పెళ్లి కాని యువకులు మరియు పెళ్ళై ఒంటరిగా జీవిస్తున్న వారిలో హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని దీనివల్ల వారికి మరణం కూడా సంభవించే అవకాశాలున్నాయని అధ్యయనం తెలియజేసింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేపట్టిన ఈ అధ్యయనంలో ఈ నిజాలు బయటపడ్డాయి. దీనికి ఎక్కువగా అవివాహిలు ఎందుకు బలవుతారు అంటే హార్ట్ఎటాక్ దాడి చేస్తే దాన్ని తట్టుకునే శక్తి వీరిలో ఉండదట.

Advertisement

కాని వివాహితులు అయితే మాత్రం గుండెకు సంబంధించిన వ్యాధులు దాడి చేసినప్పుడు సామాజిక బలంతో పాటు మనోబలంతో ఉంటారని ఆ పరిస్థితి తట్టుకొని నిలబడతారాని అధ్యయనంలో తేలింది. అందుకే పెళ్లి కాని వారు ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే అవకాశం ఉంది. జర్మనీలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఉర్జ్ బర్జ్ కు చెందిన డాక్టర్ పాబియానా మాట్లాడుతూ ఒంటరిగా ఉండి బతికే వారికంటే కుటుంబంతో కలిసి జీవించే వారు గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి తట్టుకొని ధైర్యంగా నిలబడతారని తెలిపారు..
ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నేనున్నానంటూ జీవిత భాగస్వామి ధైర్యం నింపడమే కాకుండా మందులు ఆహారాన్ని ఇవ్వడం వల్ల కూడా వారు త్వరగా కోలుకుంటారని ఆయన అన్నారు. ఇది వారి ఆయువు పై ప్రభావం చూపుతుందని తెలియజేశారు.

Advertisement

అదే పెళ్లి చేసుకొని వారికి భార్య లేదా భర్త ఉన్నంత తోడునీడగా ఇంకా ఎవరూ ఉండరు కాబట్టి వారు మానసికంగా కూడా కొన్ని కోల్పోవడం వల్ల ఎక్కువమంది మరణిస్తారని అన్నారు. ఈ పరిశోధనలో భాగంగా 2004 నుండి 2007 వరకు గుండె వైఫల్యం కారణంగా హాస్పిటల్లో చేరిన వారిలో దాదాపు 1000 మందికి పైగా పరిశీలన చేస్తే, ఇందులో 63 శాతం మంది పెళ్లి చేసుకున్నవారు. 195 మంది వితంతువులు, 96 మంది వివాహమే చేసుకోలేదు, ఇంకా 84 మంది విడాకులు తీసుకున్నారు. అందులో 375 మందికి భార్యలు లేరు. వీరంతా ఒంటరి కిందకే వస్తారు. మొత్తం 1000 మందికి పైగా ట్రాక్ చేస్తే అందులో 679 మంది మరణించారని, తోడు లేకుండా ఉన్నవారు అధికంగా ఉన్నారని జీవిత భాగస్వామి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని సర్వేలో తేలిందని అన్నారు.

ALSO READ;

భ‌ర్త‌లు అక్ర‌మ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు..? 5 కార‌ణాలు ఇవేన‌ట‌..!

NTR 31 టైటిల్ లో దీన్ని గమనించారా.. యంగ్ టైగర్ వాళ్ళిద్దరికీ కొడుకేనా..?

 

Visitors Are Also Reading