చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఒక మంచి దర్శకురాలు అంతకు మించి మంచి నటి. ఆమె విజయనిర్మల. 1946 ఫిబ్రవరి22న జన్మించింది. తమిళ్లో ఎంగ వీటు పిళ్లై అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి విజయప్రొడక్షన్స్ వారు నిర్మాత బాధ్యతలు చేపట్టడం ఆమె మొదటి సినిమా కూడా అదే అవటం అప్పటికే ఇండస్ట్రీలో నిర్మలమ్మ అనే నటి ఉండడంతో ఆమె పేరు ముందు విజయని జత చేశారు. అప్పటి నుంచి విజయనిర్మల అయ్యారు. తెలుగులో మంచి కుటుంబం అనే చిత్రంలో హీరోయిన్గా నటించారు. అప్పటి నుంచి తెలుగులో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ముద్ర వేశారు. అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించినట్లు గిన్నీస్ రికార్డ్ కూడా ఎక్కారు. కృష్ణ నటించిన దేవదాస్ చిత్రానికి విజయనిర్మల దర్శకత్వం వహించారు.
Advertisement
Advertisement
విజయనిర్మల హీరో కృష్ణకి రెండవ భార్య. ఈమెకి కూడా అది రెండో వివాహమే. కృష్ణతో సినిమాలు చేసే సమయంలో విజయనిర్మల కృష్ణమూర్తి అనే ఆయన్ని పెళ్ళి చేసుకుంది. కృష్ణమూర్తి షిప్ డిజైనింగ్ ఇంజనీర్.
వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నారు ఆయనే నరేష్. నరేష్ కూడా మనందరికి తెలిసిన నటుడే. ఒక కొద్ది సంవత్సరాలు వారిద్దరి సంసారం సజావుగానే సాగింది. సినమాల మీద ఇష్టం. హీరోయిన్గా నటించాలనే కోరిక ఉండడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు.
Also Read: కత్రినా కైఫ్ బుగ్గల్లాంటి రోడ్లు కావాలి : మంత్రి