భారతదేశంలో వివిధ మతాలకు చెందిన వాళ్లు ఉంటారు. అంతే కాకుండా రకరకాల కులాలకు చెందినవాళ్లు ఉన్నారు. ఇక ఒక్కో మతానికి…ఒక్కో కులానికి కూడా ఆచారాలు సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. హిందూ మతంలో పుట్టుక నుండి చావు వరకూ 16 కార్యక్రమాలను నిర్వహిస్తారు. గర్భవతి అవ్వగానే శ్రీమతం చేస్తారు. బిడ్డ పుట్టిన 21 రోజులకు పురుడు అంటే నామకరణం కార్యక్రమం చేస్తారు.
Advertisement
ఆ తరవాత పుట్టు వెంట్రుకలు ఇలా మొత్తం ఒకదాని తరవాత మరొకటి పదహారు కార్యక్రమాలను చేస్తారు. అంతే కాకుండా చనిపోయిన తరవాత కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. చనిపోయిన తరవాత శరీరంలోని రెండు బొటనవేళ్లను తాళ్లతో కడతారు. అయితే అలా తాడుతో బొటనవేలును ఎందుకు కడతారు అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
Advertisement
మన పూర్వీకుల నుండి అలానే చేస్తున్నారు కాబట్టి దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఇక దాని గురించి ఎవరినైనా అడిగినా అది అంతే ముందు నుండి అలాగే వస్తుంది అంటూ సమాధానం ఇస్తారు. కానీ చనిపోయిన తరవాత బొటనవేల్లను తాడుతో కట్టడం వెనకాల ఒక కారణం కూడా ఉంది. చనిపోయిన తరవాత శరీరం నుండి ఆత్మ బయటకు వెళుతుందని నమ్ముతారు.
కానీ ఆ ఆత్మ చనిపోయిన తరవాత అదే శరీరంలోకి రావాలని అందరితో కలవాలని అనుకుంటుందట. అలా ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు కాలివ్రేళ్లు కదులుతాయని అలా కదలకుండా ఉండటానికి బ్రొటనవేళ్లను కట్టడం జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కానీ అనాదిగా దీన్ని పాటిస్తూ వస్తున్నారు.
ALSO READ :
“ఫిదా” సినిమాలో ఈ మిస్టేక్ ను గమించారా..? శేఖర్ కమ్ముల ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్..!
ఎన్ని సంబంధాలు వచ్చినా మీకు పెళ్లి కావడం లేదా..? ఈ వాస్తు దోషాలు ఉంటే సరిచేసుకోండి..!