Home » వంట నూనెను ఇలా వాడితే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టే జాగ్ర‌త్త‌..!

వంట నూనెను ఇలా వాడితే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టే జాగ్ర‌త్త‌..!

by Anji
Ad

ఆహార ప‌దార్థాలు త‌యారు చేయ‌డంలో వంట‌నూనె ప్ర‌ధాన పోషిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నూనె లేక‌పోతే ప్ర‌స్తుతం ఏ కూర కాదు. ఏ వంట కాదు. నూనె ద్వారానే ఆహారం రుచిగా మారుతుంది. పోష‌కాలు కూడా శరీరానికి అందుతాయి. ఆహార రుచిని పెంచ‌డానికి వంట నూనెను అధికంగా వినియోగిస్తున్నారు. ఒక్క‌సారి వాడిన నూనెను మ‌ళ్లీ తిరిగి వాడుతున్నారు. శ‌రీరానికి చాలా ప్ర‌మాద‌క‌రం. క్యాన్స‌ర్ తో స‌హా ప‌లు ర‌కాల వ్యాధులు సంభ‌వించేందుకు దారి తీస్తుంది. వీటి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


నూనెను ఎంత త‌క్కువ‌గా తీసుకుంటే అంత మంచి జ‌రుగుతుంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అధిక నూనె తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి అధిక‌మ‌వుతుంది. వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ ఉప‌యోగించే అల‌వాటు మెద‌డు ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపుతుంది. దీంతోమ‌తిమ‌రుపు కూడా సంభ‌వించే అవ‌కాశ‌ముంది.

Advertisement

Advertisement

క్యాన్స‌ర్ పేరు విన‌గానే మ‌దిలో భ‌యాందోళ‌న‌లు క‌లుగుతాయి. వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేయ‌డం ద్వారా పాలిసైక్టిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బ‌న్స్ వంటి ప‌లు ర‌కాల హాని క‌ర‌మైన ప‌దార్థాలు ఉత్ప‌త్తి అవుతాయి. ఇటువంటి ప‌దార్థాలు శ‌రీరంలో క్యాన్స‌ర్ ఏర్ప‌డే ప్ర‌మాదాన్ని పెంచుతాయి. అదేవిధంగా రాన్సిడిటీ అనే విష‌ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేయ‌డాన్ని రాన్సిడిటీ అంటారు. దీని ద్వారా పొట్ట స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డుతాయి. అలాంటి నూనె ద్వారా ఎసిడిటీ స‌మ‌స్య కూడా వ‌స్తుంది. కాబ‌ట్టి వంట‌లో నూనెను పొదుపుగా వాడ‌డంతో పాటు.. మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసిన నూనెను వాడ‌క‌పోవడ‌మే మంచిదనే విష‌యం త‌ప్ప‌క గుర్తించుకోండి.

Also Read : 

సురేఖ‌తో పెళ్లి కోసం చిరంజీవి పై నిఘాపెట్టిన తండ్రీ కొడుకులు..!

Video Viral : న‌డిరోడ్డుపై ఓ అమ్మాయి ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading