తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్సే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే వాళ్ల హావభావాలతో, రూపురేఖలతో అందరికీ గుర్తుండిపోతారు. అలాంటి కమెడియన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటుడు కళ్ళు చిదంబరం. ఈయన కళ్లు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలోని నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. కళ్ళు చిత్రంలో నటించి ఇంటిపేరు కొల్లూరు ని కాస్త కళ్ళు గా చేసుకొని కళ్ళు చిదంబరం గా మారిపోయారు. నాటకాలు వేస్తూ సినిమాల్లో నటించారు. నటన మీద ఉన్న పిచ్చితో రోజంతా జాబ్ చేస్తూ రాత్రులు నాటకాల్లో నటించేవారు. చాలా రోజులు అలా చేయడంతో తనకళ్లు అలా అయిపోయాయని చాలా మందికి తెలియదు. తన తుది శ్వాస వరకూ తన జీవితాన్ని నాటకరంగానికి, సేవా కార్యక్రమాలకు,పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించారు. అయితే అందరూ అనుకున్నట్టుగా చిదంబరం గారికి చిన్నప్పట్నుంచి మెల్లకన్ను లేదు. చాలా స్మార్ట్ గా ఉండేవారు. దాదాపు 12 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా నాటకాల్లో నటిస్తూ ఉండడంవల్ల ఒక కన్ను నరం పక్కకు వెళ్లి మెల్లకన్ను గా ఏర్పడింది. ఆ లోపమే ఆయనను సినిమారంగానికి పరిచయమయ్యేలా చేసింది. ఈయన మూడు వందల సినిమాల్లో నటించారు. కుటుంబాన్ని మిస్ కాకుండా, ఆఫీస్ ను విడవకుండా, సినిమాల్లో నటించారు చిదంబరం. పారితోషికం ఎంతిస్తే అంత తీసుకునేవారు. అలా ఇండస్ట్రీలో అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఓసారి గోవింద గోవింద సినిమా షూటింగ్ లో శ్రీదేవి కళ్ళు చిదంబరం తో నటించాల్సి ఉంది. కాని శ్రీదేవి ఆయనను చూసి భయపడిందో ఏమోగానీ ఆయనతో నటించనని చెప్పేసిందట. అప్పుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవి తో మాట్లాడుతూ.. ఆయన ఎవరి అనుకుంటున్నావ్ అసిస్టెంట్ ఇంజనీర్,నంది అవార్డు అందుకున్న నటుడు. ఆయన నేను ఈరోజు డైరెక్ట్ చేస్తాను. లేకపోతే నేను ఈ సినిమా ఇక్కడితోనే ఆపేస్తాను అన్నారు. వర్మ అలా అనేసరికి సెట్ లో ఉన్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక శ్రీదేవి కూడా ఆయన గొప్పతనానికి ఒప్పేసుకుంది. అలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కళ్ళు చిదంబరం. నవ్వు ముఖం తోనే కాలం చేశారు కళ్ళు చిదంబరం.
Advertisement
ALSO READ;
Advertisement
Samantha: మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సమంత గ్రీన్ సిగ్నల్..!
కరాటే కళ్యాణి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆమె తల్లి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?