Home » చిరు చేయాల్సిన ఆ సినిమాను వెంకటేష్ ఎలా లాకున్నారో తెలుసా..?

చిరు చేయాల్సిన ఆ సినిమాను వెంకటేష్ ఎలా లాకున్నారో తెలుసా..?

by Azhar
Ad

ఒక్క సినిమా అనేదానికి షూటింగ్ సమయంలో ఎంత పని ఉంటుందో… ఆ సినిమా ప్రారంభానికి ముందు కూడా అంతే పని ఉంటుంది. కథ రాయడం దగ్గర నుండి.. హీరో హీరోయిన్ ఎంపిక వరకు చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో మనం ముందు నుండి అనుకున్న హీరో కాకుండా.. వేరే వారితో కొన్నిసార్లు సినిమా చేయాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికే మన టాలీవుడ్ లో చాలా సార్లు జరిగింది. ఓ హీరో నో చెప్పిన కథ మరో హీరో చేసి హిట్ కొట్టడం అనేది మనం చాలా సార్లు చూసాం. కానీ ఓ హీరో ఒప్పుకున్నా సినిమాను మరి హీరో లాకోవడం అనేది చాలా తక్కువ.

Advertisement

అయితే చిరంజీవి, వెంకటేష్ ల మధ్య అలా జరిగింది. చిరు చేయాల్సిన ఓ సినిమాను వెంకటేష్ చేశారు. ఎలా అంటే.. నిర్మాతగా కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సుందరకాండ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో… సత్యనారాయణ గారు రజనీకాంత్ నటించి సూపర్ హిట్ గా నిలిచిన అన్నామలై సినిమాను తెలుగులో డబ్ చేయడానికి రైట్స్ తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నారు.

Advertisement

అప్పుడు అదే ఫ్లైట్ లో చిరంజీవి కలిశారు. ఆయనకు ఫ్లైట్ లోనే ఆ సినిమా కథ చెప్పడంతో… చిరుకి బాగా నచ్చేసి చేయడానికి ఓకే చెప్పారు. దాంతో చిరంజీవి ఒకే చెప్పను అనే సంతోషంలో సుందరకాండ షూటింగ్ దగ్గరకు వచ్చిన సత్యనారాయణ.. ఆ సినిమా స్టోరీని వెంకటేష్ కు కూడా చెప్పారు. అప్పుడు వెంకటేష్ ఈ సినిమా కూడా మానమే చేద్దాం అనడంతో.. సత్యనారాయణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. చిరుతో తీయాలా.. లేక వెంకీతో తీయాలా అనే అయోమయంలో పడిపోయి.. తర్వాత చిరుకి చెప్పి.. ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ తోనే చేసారు. కొండపల్లి రాజాగా తెరకెక్కిన ఆ సినిమా మన తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

అంబటి రాయుడు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచిన చెన్నై..!

Visitors Are Also Reading