Home » చాణక్య నీతి ప్రకారం విజయాన్ని సొంతం చేసుకోవాలంటే వీటికి తప్పక దూరంగా ఉండాలట !

చాణక్య నీతి ప్రకారం విజయాన్ని సొంతం చేసుకోవాలంటే వీటికి తప్పక దూరంగా ఉండాలట !

by Sravanthi
Ad

డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కానీ చాణిక్యుడు చెప్పినట్టు అది అందరికీ సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే డబ్బులను సృష్టిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో వారి వద్ద డబ్బు నిలుస్తుంది అన్నది ఒక నమ్మకం. ఇదే విషయాన్ని ఆచార్య చాణిక్యుడు అర్థశాస్త్రంలో తెలియజేశారు.

Advertisement

కష్టపడి ఇష్టంతో పని చేసి కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాణిక్యుడు అన్నారు. డబ్బు వస్తుంది కానీ దాన్నీ నిలుపుకోవడంలో చాలామంది విఫలం అవుతుంటారు. మరి డబ్బు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..!!

Advertisement

అత్యాశ పడవద్దు : చాణక్యుడు చెప్పినట్లు డబ్బుపై అతిగా అత్యాశ చూపకూడదు. ఎవరికైనా కష్టపడితే డబ్బు వస్తుంది. కష్టపడకుండా డబ్బు ఎక్కువ కాలం నిలువదు.దురాశతో సంపాదిస్తే అనేక లోపాలు ఉన్నాయని వెల్లడించారు. అత్యాశ ఉన్న వ్యక్తులకు డబ్బు నిలువదని చాణక్యుడు తన నీతిలో తెలిపాడు.అనవసర ఖర్చులు మానాలి :
చాణిక్యుడు చెప్పిన నీతి ప్రకారం లక్ష్మీదేవిని అవమానించకూడదని, ఎప్పుడూ లక్ష్మీదేవి పై గౌరవంతో ఉండాలి. అలాంటి వారి దగ్గర డబ్బులు నిలుస్తాయని, దాన్ని పొదుపుగా వాడుకోవాలని అన్నారు.ప్రతిష్టను దుర్వినియోగ పరచవద్దు : నీకు డబ్బు అధికారం ఉంది కదా అని బలహీనమైన వారిని వేధించడం,అవమానించడం వారి హక్కులను లాగేసుకోవడం వంటివి చేసేవాడి దగ్గర లక్ష్మీదేవి నిలవదని చాణిక్యుడు తన గ్రంథంలో వెల్లడించారు.

ALSO READ:

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

“జబర్దస్త్” శాంతి స్వరూప్ ని హైపర్ ఆది టీం అంతలా అవమానించారా ?

Visitors Are Also Reading