Ad
ఒక్కప్పుడు వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన హీరోలలో నరసింహరాజు ఒక్కరు. నీడలేని ఆడది, తూర్పు పడమర వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అప్పుడు ఐటం సాంగ్స్ చేసే జయమాలిని గురించి నరసింహరాజు చాలా మంచి అభిప్రాయం కలిగి ఉండేవారు. 1978 లో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా జగన్మోహిని సినిమా తీస్తున్న సమయంలో… రాజ్ కుమార్ డైరెక్షన్ లో పునాదిరాళ్ళు అనే సినిమా వచ్చింది.
ఐదు ముఖ్య పాత్రలతో వచ్చిన ఈ సినిమాలో నరసింహరాజుతో పాటుగా చిరంజీవి కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు మళ్ళీ రాజ్ కుమార్ డైరెక్షన్ లో నరసింహరాజు హీరోగా ఓ సినిమా చేయగా అందులో… చిరంజీవి విలన్ గా నటించారు. అయితే 6 ఏళ్ళ తర్వాత చిరంజీవి , జయసుధ జంటగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగధీరుడు సినిమాలో నరసింహరాజు గారు విలన్ గా నటించడం గమనార్హం.
అయితే అంతకంటే ముందు నుంచి కొంచెం కొంచెం కిందికి పడిపోయిన నరసింహరాజుకు 1993 నుండి సినిమా ఆఫర్లు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో ఆర్ధిక కష్టాలో కూరుకుపోయిన ఆయన కుటుంబాని పోషించడానికి బుల్లితెర వైపు చూసారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఇక్ఫా ఆగకుండా తెలుగు, తమిళ సీరియల్స్ లో నటిస్తూనే ఉన్నారు. ఆయన కు ఉన్న ఇద్దరు పిలల్లకు కూడా పెళ్లిళ్లు చేసారు.
ఇవి కూడా చదవండి :
Advertisement