లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గురించి తెలియని వారుండరు. అయితే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల మధ్య పెరిగారు. ఎంబీఏ కోసం ముంబై వెళ్లిన కొద్దిరోజుల పాటు ఒక కన్సల్టెన్సీ లో పని చేశారు. కానీ ఆయన మనసంతా సినిమాల మీదే ఉండేది. ఒక మంచి ప్రేమ కథ మొత్తం రాసుకున్న మణిరత్నం ఒక నిర్మాత కోసం తిరిగాడు. అలాగే ఆ కథకు మంచి సంగీతం ఇవ్వగలిగే సంగీత దర్శకుడి కోసం కూడా వెతికారు. అయితే బాలు మహేంద్ర సినిమాకి ప్రాణం పోసేలా సంగీతం ఇవ్వగలిగే ఒక వ్యక్తి ని నీకు పరిచయం చేస్తా పదా అని మణిరత్నం కు చెప్పారట. ఆయనే ఇళయరాజా..అప్పటికి ఆయన చాలా బిజీగా ఉన్నారు. అలా మొదటి సినిమాకే ముగ్గురు లెజెండ్స్ తో పని చేశారాయన.ఆ సినిమా పేరే పల్లవి-అనుపల్లవి. ఇది కన్నడ సినిమా. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఆ సినిమా ముందుగా కన్నడలో తీయాల్సి వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయింది. అయితే బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచినా, తర్వాత ఒక క్లాసిక్ మూవీ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇళయరాజా తో మణిరత్నం ప్రయాణం మాత్రం చాలా ఏళ్లు సాగింది. అయితే ఇళయరాజాకు డబ్బుల కంటే మణిరత్నం ఆలోచనలే నచ్చాయి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో క్లాసిక్ మూవీస్ తీశారు. అయితే ఇళయరాజా తో కావాలనే బంధం తెంచుకున్నారు మణిరత్నం. రోజా సినిమాలో తనకు కొత్త తరహా సంగీతం కావాలని కోరుకున్నారు. దాంతో ఇళయరాజాకు చెప్పి మరీ ఏ. ఆర్.రెహమాన్ తో రోజా సినిమా కి పనిచేశారాయన. గురువుని కాదని శిష్యున్ని పెట్టుకున్నారు మణిరత్నం. కానీ ఇంతవరకు మణిరత్నం, ఏ ఆర్ రెహమాన్ జోడి మాత్రం విడిపోలేదు.
Advertisement
ALSO READ :
Advertisement
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. హీరో విశ్వక్ సేన్ కు మరో బంపర్ ఆఫర్..!!
“రంగస్థలం” కథను చిరంజీవి నటించిన ఆ సినిమా నుండి కాపీ కొట్టారా…?