టీవీల్లో వచ్చే సీరియల్స్ చూడడానికి మహిళలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కొంత మంది సాయంత్రం వేళల్లో వచ్చే సీరియల్స్‌ను మాత్రం అసలు వదలరు. ముఖ్యంగా పల్లెటూర్లలో సాయంత్రం వరకు పనులు చేసుకుని సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి సీరియల్స్ చూస్తుంటారు. సీరియల్ మధ్యలో వచ్చే బ్రేకు సమయంలో ఎక్కువగా వంట చేస్తుంటారు. స్టార్ మా సీరియల్లో జానకి కలగనలేదు అనే సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ విడుదల అయింది. ఇవాళ మే 4, 2022 బుధవారం292 ఎపిసోడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పిండివంటలు చేసుకుని బతికేవాడికి ఎవరు విలువ ఇస్తారని.. జానకికి చేసి రాము అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ విషయంపై జానకి చాలా పడుతుంది. ఈ విషయాలను జ్ఞానాంబ వింటుంది. నువ్వు ఇవాళ అందరి ముందు అవమానపడడానికి ఓ రకంగా మీ అమ్మ కూడా కారణం అని.. క్షమిస్తావా రాము అని అనుకుంటుంది. ఇంతలో జానకి తన దగ్గరిక మీరు కాదు అత్తయ్య గారు నేనని అంటుంది. నా కుమారుడి జీవితంలో ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. చదువుకున్న అమ్మాయి వాడికి భార్యగా వస్తే ఆ చదువుకు ఉన్న అహంతో నా బిడ్డను అవమానిస్తుందని భయపడ్డాను. చదువులేని అమ్మాయిని నేను నా కొడుకుకు ఇచ్చి వివాహం చేయాలనుకున్నాను.
Advertisement
ఇవాళ నువ్వు వాడి జీవితంలోకి రాకపోయి ఉంటే..వాడు అవమాన పడి ఉండేవాడు కాదుని.. నేను వాడికి జరిగిన ప్రతి ఒక్కదానికి కారణం నువ్వే.. ఇందులో నా నిర్లక్ష్యం కూడా ఉంది. మీ అన్నయ్య నీ చదువును దాచి తన స్వార్థ్యం చూసుకున్నాడు అని జ్ఞానాంబ అంటుంది. మోసం చేసిన మీ అన్నయ్య అందరూ బాగానే ఉన్నారు. కానీ నా కొడుకు, నేను బాధపడుతున్నాం. ముందు ముందు ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నాం. నా కుమారుడి భవిష్యత్ గురించి భయపడుతున్నాను. ఓ చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి వాడు అవమానపడడానికి కారణం అయ్యానే అని కుమిలిపోతున్నాను అని జ్ఞానాంబ పేర్కొంటుంది. నా మీద నాకే కోపంగా ఉంది. ఎదుటి వాళ్లు తమ తెలివితేటలతో మోసం చేస్తుంటే.. తెలుసుకోలేకపోతున్నానే అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. కనీసం నా బిడ్డ కాలులో ముల్లు గుచ్చుకుంటేనే నేను తట్టుకోను అని అంటుంది జ్ఞానాంబ.
మరొక వైపు రాము ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. గోవిందరాజు అక్కడికి వచ్చి రాము కాళ్లు పట్టుకుంటాడు. రాము ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. ఏంటి నాన్నా ఇది.. ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు రాము. నన్ను క్షమించురా.. జరిగిన అవమానానికి నీ మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో నాకు తెలుసురా రాము. నాకొడుకును పట్టుకొని వంటవాడు చదువుకొని వాడు అనడానికి పూర్తిగా అసమర్థ తండ్రే రా కారణం అని గోవిందరాజు అంటాడు. ఆ రోజు నా నడుము పడిపోకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఇన్ని అవమానాలు పడి ఉండేవాడివి కాదురా.. నా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటే.. నిన్ను బ్రహ్మండంగా చదివించి ఉండేవాడిని అంటాడు గోవిందరాజు. ఇక మళ్లీ జానకిని బుక్ చేయడానికి మల్లిక ప్రయత్నిస్తుంది. జ్ఞానాంబ ముందు తనను మళ్లీ అవమానిస్తుంది మల్లిక. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.
Also Read :
పెళ్లికి ముందు సహజీవనం చేస్తే వచ్చే సమస్యలు ఏంటి…? తప్పక తెలుసుకోండి…!
యూరిన్ కలర్ మారిందా.. అయితే డేంజరే..!!