ఇండియా మరియు తెలుగు రాష్టాల్లో ముఖ్యమైన వార్తలు టాప్ టెన్ లో ప్రతి రోజు మీకోసం మనంన్యూస్ అందిస్తుంది.
దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. రుతుపవనాల ముందు వర్షాలతో మారిన వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. దాంతో విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Advertisement
ఈదురుగాలుల వల్ల చార్మినార్, మలక్ పేట్, బహదూర్ పురాలో, చాదర్ ఘాట్ లలో హోర్డింగ్స్ కూలిపోయాయి. భారా వర్షం కారణంగా వరదనీరు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయింది. దాంతో మోటార్ల సహాయంతో డీఆర్ఎఫ్ బృందాలు నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. 19 జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు అలర్ట్ ఇప్పటికే అలర్ట్ అయ్యాయి.
టాలీవుడ్ నటీమనులు త్రిష, మంచు లక్ష్మి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాంతో వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.
ఐపీఎల్ గత రాత్రి జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ 8వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగా… పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికట్లె నష్టానికి 145 పరుగులు సాధించింది.
Advertisement
ఖమ్మంలో అశోకవనంలో అర్జున కల్యాణం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చానని తొక్కేయాలని కొందరు చూస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలు తన కుటుంబాన్ని బాధించాయని విశ్వక్ సేన్ అన్నారు.
రంజాన్ పండగ సంధర్బంగా నిన్న భారత్ పాక్ సరిహద్దుల్లో జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. పలు సెక్టార్ లలో జవాన్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కరోనా కేసులు 3వేలు దాటాయి. ఢిల్లీలో కూడా కరోనా కేసుల్లో 32శాతం పెరుగుదల కనిపించింది.
ఉక్రెయిన్ లో తక్షణమే రష్యా కాల్పుల విరమణ చేయాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ చేరుకున్న ప్రధాని మోడీ ఓ సమావేశంలో ఈవిధంగా వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ లోని జోద్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈద్ జెండాల ఏర్పాటుతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు పరిస్థితిని మొదట అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ప్రార్థనల అనంతరం మళ్లీ ఘర్షణలు జరిగాయి.
పాంగాంగ్ సరస్సు పై చైనా చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయ్యింది.
Also Read:
అమెరికారాలో రికార్డుస్థాయిలో విడుదలవ్వనున్న సర్కారు వారి పాట