Home » అమెరికాలో రికార్డుస్థాయిలో విడుద‌ల‌వ్వ‌నున్న స‌ర్కారు వారి పాట

అమెరికాలో రికార్డుస్థాయిలో విడుద‌ల‌వ్వ‌నున్న స‌ర్కారు వారి పాట

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన తాజా మూవీ సర్కారు వారి పాట. సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ 24 గంటల్లోనే టాలీవుడ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. తాజాగా ఈ సినిమా యోఎస్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. ఈ చిత్రము విడుదలకు మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మహేష్ సర్కారు వారి పాట యూఎస్ లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 603 లొకేషన్స్ లో విడుదల కాబోతుంది. పాన్ ఇండియా సినిమాలు తప్పించి ఓ తెలుగు మూవీ ఈ రేంజ్‌లో విడుద‌ల‌వ్వ‌డం ఇదే తొలిసారి. మ‌హేష్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

టాలీవుడ్ సినిమాల విష‌యానికొస్తే తెలుగుతో పాటు ఓవ‌ర్సిస్‌లో పోకిరి సినిమా విడుద‌లైంది. ఆ త‌రువాత తెలుగు సినిమాలకు ఓవ‌ర్సిస్ మార్కెట్ కీల‌క‌మైంది. ఓవ‌ర్సిస్‌లో 1 మిలియ‌న్ డాల‌ర్స్ పైగా వ‌సూళ్లు సాధించిన చిత్రాల్లో మ‌హేష్ బాబు చిత్రాలే ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం. తాజాగా ఈ సినిమాతో మ‌హేష్ మ‌రో రికార్డు సొంతం చేసుకుంటున్నాడు. ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళావ‌తి సాంగ్ 150 మిలియ‌న్‌పైగా వ్యూస్ రాబ‌ట్టింది. అనంత్ శ్రీ‌రామ్ రాసిన ఈ పాట‌ను సిద్ శ్రీ‌రామ్ పాడారు. సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు అన్ని సోష‌ల్ మీడియాలో మిలియ‌న్ల కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి. ఇక ట్రైల‌ర్ అయితే రికార్డునే క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లోనే 26 మిలియ‌న్ వ్యూస్‌, 1.2 మిలియ‌న్ లైక్స్‌తో అత్య‌ధిక మంది చూసిన ట్రైలర్‌గా నిలిచింది.

Advertisement


ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెరిగాయి. ముఖ్యంగా ట్రైల‌ర్ లో మ‌హేష్ చెప్పే డైలాగ్‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ఓ వంద వ‌యాగ్రాలు వేసి శోభ‌నం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గ‌దికి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చారు అని చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమా ఇప్ప‌టికే యూఎస్ బుక్సింగ్ ప్రారంభ‌మ‌వ్వ‌డం విశేషం. విడుద‌ల‌కు దాదాపు 15 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వ‌డం మామూలు విష‌యం కాద‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రొక వైపు మ‌హేష్ కెరీర్‌లో మే నెల‌లో విడుద‌లైన గ‌త చిత్రాల‌ను ప‌రిశీలించిన‌ట్ట‌యితే నాని, నిజం, బ్ర‌హ్మోత్స‌వం చిత్రాలు మే నెల‌లో విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. మ‌హ‌ర్షి మాత్రం సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డం విశేషం. ఇక స‌ర్కారు వారి పాట చిత్రాన్ని కేవ‌లం తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఒకేసారి పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

అబార్ష‌న్ చ‌ట్టంపై అమెరికా సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిదేనా…?

Visitors Are Also Reading