దేశం గర్వించదగ్గ నటులలో నందమూరి తారకరామారావు ఒకరు. తెలుగులో సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సాంఘీక చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా పౌరాణిక జానపద చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే విధంగా 1953లో నిర్మాణ రంగలోకి అడుగుపెట్టి ఏకంగా 28 సినిమాలు చేయడం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది.
Advertisement
ఎన్టీఆర్ నిర్మించిన సినిమాలు దాదాపుగా హిట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో ఉమ్మడి కుటుంబం కూడా ఒకటి. ఈ సాంఘీక చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ రూమ్ మేట్ డి యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఉమ్మడి కుటుంబంలో హీరోయిన్ గా కృష్ణ కుమారి నటించింది. ఎన్టీఆర్ నిర్మించిన మొదటి సినిమా పిచ్చిపుల్లయ్య లో కూడా హీరోయిన్ కృష్ణ కుమారినే కావడం విషేశం. ఇక ఈ సినిమా తరవాత పదమూడు చిత్రాల తరవాత మళ్లీ కృష్ణ కుమారిని తీసుకున్నారు.
Advertisement
ఇక ఉమ్మడి కుటుంబం సినిమా నలుగురు అన్నదమ్ముల కథ.. తమ్మడి వేషం ఎన్టీఆర్ ది…కాగా అన్నల పాత్రలకు ఎంపిక మొదలైంది. ఇక పెద్దన్న పాత్ర కామెడీపాత్ర ఆ వేషం రేలంగికి ఇచ్చారు. రెండో అన్న రైతు ముక్కుసూటి మనస్తత్వం, ఇక మూడో పాత్ర డాక్టర్ ఆ పాత్రకోసం కైకాల సత్య నారాణను అనుకున్నారు. కానీ రైతు పాత్ర తనకు ఇవ్వాలని ఎన్టీఆర్ ను అన్నా అని పిలిచే కైకాల కోరారు.
దాంతో విలన్ పాత్రలు చేసిన కైకాలకు రైతు పాత్ర సూట్ అవ్వదని ఎన్టీఆర్ సందేహంలో పడ్డారు. కానీ కైకాల తనపై రెండు రోజులు షూట్ చేయాలని నచ్చితేనే ఇవ్వాలని చెప్పారు. ఇక రెండు రోజుల షూటింగ్ తరవాత కైకాల నటన చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. వెంటనే రైతు పాత్రకు కైకాలను ఫిక్స్ చేసి డాక్టర్ పాత్ర ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. ఇక ఈ సినిమా చూసిన కేవీ రెడ్డి కైకాల సత్యనారాయణను అభినందించారట.
Also Read:
వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?
NTR సిఎంగా ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచమన్న దాసరితో NTR ఏమన్నాడో తెలుసా?