ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొంది ఆటలలో క్రికెట్, ఫుట్ బాల్ మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. అయితే ఈ ఆటలు చూసే ప్రతి ఒక్కరికి స్లెడ్జింగ్ అనే దాని గురించి తెలిసే ఉంటుంది. ఆటగాళ్లకు కోపం వచ్చినప్పుడు, వారు సహనం కోల్పోయినప్పుడు స్లెడ్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యం గా ఈ స్లెడ్జింగ్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఉన్న స్థానం మరో లెవల్. అయితే ఇప్పుడు అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో తెలుసుకుందాం..!
Advertisement
ప్రపంచంలోనే అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ అంటే టెన్నిస్ అంట. ఇందులో మిగితా అన్నిరకాలైన ఆటల కంటే తప్పకువ స్లెడ్జింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. అందుకు మొదటి కారణం… ఇందులో ఆటగాళ్లు ఇద్దరు దూరంగా ఉండగా.. వారి మధ్యలో యంపిర్ ఉంటారు. కానీ క్రికెట్, ఫుట్ బాల్ లలో అలా ఉండదు. కాబట్టి ఏమైనా స్లెడ్జింగ్ జరిగితే తప్పకుండా అది అంపైర్ కు తెలుస్తుంది.
Advertisement
ఇక రెండవది.. ఈ ఆటలో స్లెడ్జింగ్ జరిగితే ఫైన్స్ అనేవి చాలా దారుణంగా వేస్తుంటారు. వాటిని కట్టే బదులు నోరు మూసుకొని ఉండటం మంచిది అని ప్లేయర్స్ అనుకుంటారు. అయితే ఓసారి ఇలానే నోరు జారినందుకు అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ కు 17 వేళా డాలర్లు.. అంటే మన రూపాయలలో 12 లక్షలకంటే ఎక్కువగా ఫైన్ వేశారు. అందుకే టెన్నిస్ ప్లేయర్స్ నోరును చాలా జాగ్రత్తగా వాడుతుంటారు.
ఇవి కూడా చదవండి :
అతడే మన భవిష్యత్ టెస్ట్ కెప్టెన్ : యువీ
సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుంచి కోహ్లీ ఔట్..?