ఒక భాషలో హిట్ అయిన సినిమాలను వెంటనే మరో భాషలోకి రిమేక్ చేయడం సాధారణ విషయమే.! ఈ రిమేక్ లు పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా నిలిపాయి. పవన్ కెరీర్ లో మొత్తం 24 సినిమాలు తీస్తే అందులో 11 రిమేక్ సినిమాలే., వాటిలో 8 సూపర్ హిట్లుగా నిలిచాయి.
పవన్ రిమేక్ సినిమాలు వాటి రిజల్ట్స్ :
Advertisement
1) గోకులంలో సీత:
ఇది తమిళ్ ‘గోకులతిల్ సీతై’ కు రీమేక్. పవన్ కళ్యాణ్, రాశీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు.
2) సుస్వాగతం:
ఇది తమిళ్ ‘లవ్ టుడే’ సినిమాకు రిమేక్ . పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు.
3) ఖుషి:
ఎస్.జె.సూర్య తమిళంలో తీసిన ‘ఖుషి’ నే తెలుగులో అదే టైటిల్ తో రిమేక్ చేశాడు. భూమిక ఈ సినిమాలో హీరోయిన్
4) అన్నవరం:
తమిళ్ ‘తిరుపచి’ చిత్రానికి రీమేక్ ఇది. పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ఈ సినిమాను భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేసారు.
Advertisement
5 ) గబ్బర్ సింగ్:
సల్మాన్ నటించిన దబాంగ్ సినిమాకు రిమేక్ ఇది. హరీష్ శంకర్ డైరెక్టర్
6) గోపాల గోపాల:
హిందీ ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్ ఇది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రానికి డాలీ దర్శకుడు.
7) కాటమరాయుడు:
తమిళ్ లో వచ్చిన ‘వీరం’ అనే సినిమా రిమేక్ ఇది. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించాడు.
8 ) వకీల్ సాబ్ :
హిందీలో అమితాబ్, తాప్సి లు నటించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఈ సినిమా ను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు
పైన చెప్పిన సినిమాలన్నీ సూపర్ హిట్లు కాగా…, హిందీ లవ్ ఆజ్ కల్ ను డాలీ తీన్ మార్ గా రిమేక్ చేశారు. ఇది ఫ్లాప్ గా మిగిలింది.
ఇవి కూడా చదవండి : Jr. NTR & మంచు మనోజ్ ల మధ్య 5 పోలికలు.