మలక్‌పేట నియోజకవర్గంలోని మూసారాంబాగ్‌లో ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంలో శుక్రవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా నిషేదిత మావోయిస్ట్ సాహిత్యం ప్రింట్ చేస్తున్నారని సమాచారంతోనే సోదాలు చేపట్టారు. మావోయిస్ట్ నేత ఆర్.కే.జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవలే మావోయిస్ట్ అగ్రనేత ఆర్.కే. అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే.
Advertisement
Advertisement
భారీగా 1000 వరకు పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్.కే. జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రింటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే బైండింగ్ చేసిన వెయ్యి పుస్తకాలతో పాటు, బైండింగ్ చేయని పుస్తక మెటీరియల్‌ను కూడ సీజ్ చేసారు. పుస్తకాల ప్రింటింగ్‌కు సంబంధించి ఎలాంటి రశీదులు లేవు. పుస్తకాలలో నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయని మల్‌పేట ఏసీపీ పేర్కొన్నారు. నవ్య ప్రింటింగ్ యజమాని రామకృష్ణారెడ్డి కొంతకాలంగా మావోయిస్ట్ అనుబంధ సంఘాలకు తోడ్పాటును అందిస్తున్నట్టు పోలీసులు అనుమానించారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో అడిషనల్ డీసీపీ మురళీధర్‌రావు, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.