ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం ప్రారంభం అవ్వనున్నాయి. 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని గవర్నర్ బిష్వభూషణ్ నోటిఫికేషన్ కూడ జారీ చేసారు. అయితే నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 4, 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ప్రకటించారు. కానీ ప్రస్తుతం కేవలం 18న ఒక్కరోజే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
Advertisement
Advertisement
పలు కీలక పద్దులను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రధాన ప్రతిపక్షం ఎదురు చూస్తున్నది. అనంతపురం విద్యార్థుల ఆందోళన, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు పలు అంశాలను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధం అవుతుండగానే కేవలం ఒక్కరోజే సమావేశాలు అని తెలిసినది. అదేవిధంగా ఇటీవల సీఎం జగన్ ఇడిశా సీఎం నవీన్‌పట్నాయక్ తో జరిపిన చర్చల సారాంశాన్ని కూడ సభలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో కేవలం 18వ తేదీ గురువారం ఒక్కరోజే సమావేశాలు నిర్వహించి.. ఎన్నికలు ముగిసాక అసెంబ్లీని మరోసారి పెట్టనున్నది ఏపీ ప్రభుత్వం.