తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విధితమే. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రైతు ధర్నా, ఆందోళనకు పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జిల్లాలు, మండల కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారు.
Advertisement
Advertisement
ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ధర్నా చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నాగేందర్. బండి సంజయ్‌పై తలపైన ఉన్న నాలుగు వెంట్రుకలు పీకేసీ గుండు గీయిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో అడుగు పెడితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంతు చూస్తాం అని దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించుకున్న విషయం విధితమే. తాజాగా దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై బండి సంజయ్ కౌంటర్ ఇస్తారో లేదో వేచి చూడాలి మరి.