ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఎంతో మంది ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ దెబ్బ నుంచి కోరుకుంటున్న తరుణంలో పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం సామాన్య ప్రజలకు అందకుండా ఆకాశాన్నంటాయి. ఈ తరుణంలో ఈ రేట్లపై సామాన్యులకు త్వరలో శుభవార్త రానుంది.
Advertisement
పెట్రోల్, డీజిల్ రేట్లు మీద సుంకాన్ని తగ్గించడానికి సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నట్టు జాతీయ బిజినెస్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు లోక్ సభలో గత సంవత్సరం ఒక లీటర్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం 21.80 వస్తోందని, పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం 27.90 ఆదాయం వస్తుందని లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం అందరికీ తెలిసిన విషయమే.
Advertisement
అందుకే ఏప్రిల్ 10 నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎల్పిజీ సిలిండర్ల ధరలు మాత్రం మరోసారి పెరగవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా ఈ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నదని సమాచారం. ఏది ఏమైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే బాగుంటుందని సామాన్యులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.