Home » ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. ఏటీఎం కార్డు లేకుండానే మ‌నీ విత్ డ్రా..!

ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. ఏటీఎం కార్డు లేకుండానే మ‌నీ విత్ డ్రా..!

by Anji
Ad

మోస‌పూరిత లావాదేవీల‌కు చెక్ పెట్ట‌డానికి ఇండియాలోని అన్ని బ్యాంకులు, ఏటీఎంలో కార్డ్‌లెస్ న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆర్‌బీఐ ప్ర‌తిపాదించిన‌ట్టు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ తెలిపారు.

Advertisement

యూపీఐని ఉప‌యోగించి అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వ‌ర్క్‌ల‌లో ఈ స‌దుపాయాన్ని తీసుకురానున్నారు. కొన్ని బ్యాంకుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. కానీ ఇప్పుడు వినియోగ‌దారుల సౌక‌ర్యం కోసం కొత్త‌గా యూపీఐని ప్ర‌వేశ‌పెట్టి అన్ని బ్యాంకులు ఏటీఎంల‌లో న‌గ‌దు విత్ డ్రా చేసుకునే స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు. ఏదైనా బ్యాంకు, ఏటీఎం వ‌ద్ద ఎలాంటి కార్డు లేకుండానే ఏకీకృత చెల్లింపుల ఇంట‌ర్‌ఫేస్ ని ఉప‌యోగించి న‌గదు విత్ డ్రా చేయ‌వ‌చ్చు.

Advertisement

ఎలాంటి కార్డు లేకుండానే ఏకీకృత చెల్లింపుల ఇంట‌ర్ ఫేస్ ని ఉప‌యోగించి న‌గ‌దు విత్ డ్రా చేయ‌వ‌చ్చు. ఎలాంటి భౌతిక కార్డులు అవ‌స‌రం లేకుండా సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీలు చేయ‌డానికి, మోస‌పూరిత లావాదేవీల‌ను నిరోధించ‌డానికి ఈ స‌దుపాయం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భార‌తీయ రిజర్వ్ బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ తెలిపారు.

Also Read :  CM Jagan: రోజా కోసం డేర్ స్టెప్ వేసిన సీఎం జ‌గ‌న్‌

Visitors Are Also Reading