భారత స్పిన్ దిగ్గజాలలో ఒకరు హర్భజన్‌సింగ్. ఇటీవలే అతను వ్యాఖ్యాతగా మారి అభిమానుల హృదయాలను దోచుకుంటున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటరీగా వ్యవహరిస్తున్న హర్భజన్ సింగ్ చెన్నై సూపర్‌కింగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై జట్టు కెప్టెన్‌ను మార్చింది. ధోని అకస్మాత్తుగా తప్పుకున్నాడు. ముఖ్యంగా ధోని ఉండగానే కొత్త కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తే ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతాడనే చెన్నై జట్టు రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించినట్టు సమాచారం.
Advertisement
స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో హర్భజన్ సింగ్ ఈ విధంగా స్పందించాడు. చెన్నై కెప్టెన్‌గా జడేజాను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే కానీ.. జడేజా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. జట్టు ఫీల్డింగ్ విషయాలపై దృష్టి సారించాల్సి ఉంది. జడేజా భారాన్ని తగ్గించుకుంటున్నాడని.. ధోనికి బరువును పెంచుతున్నాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా జడేజా బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతమని.. అతడు జట్టుకు సంబందించి కొన్ని సమస్యలపై దృష్టి సారించాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు హర్భజన్ సింగ్.
Advertisement
ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను చూస్తే.. చెన్నై జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా ఉందని.. బ్యాటింగ్ మెరుగు అవ్వాల్సి ఉందని హర్భజన్‌సింగ్ పేర్కొన్నాడు. జడేజాకు అవగాహన అవసరం అని.. కొద్ది రోజుల్లోనే అతను నేర్చుకుని మెరుగు అవుతాడని తెలిపాడు. కెప్టెన్‌గా జడేజా తనను తాను నిరూపించుకోవాల్సి ఉందని.. కెప్టెన్‌గా అతనిపై బెట్టింగ్‌లు వేయడం సరైంది కాదన్నాడు. ఇప్పటివరకు జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై జట్టు వరుస ఓటమి పాలైంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే చెన్నై మంచి ఆటను ప్రదర్శించాల్సి ఉంది.
Also Read : 100 తీసుకునే నువ్వు నన్ను ఎదిరిస్తావా..? కానిస్టేబుల్ పై ఎంఐఎం కార్పోరేటర్ దాదాగిరి..!