ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకుందని, దమ్ముంటే కేంద్ర మంత్రి షెకావత్ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ నీటి వాటా తేల్చండి. తెలంగాణకు ఎంత వస్తే అంత ఇవ్వండి అని కేంద్ర మంత్రి చెప్పాలి అని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం విధితమే. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలుగు రాష్ట్రాల జలవివాదంపై షెకావత్ మీడియాతో మాట్లాడారు.
Advertisement
Advertisement
కృష్ణా, గోదావరి నదీ జలాలపై ముఖ్యంగా తెలంగాణ వేసిన పిటిషన్ వల్లనే ఆలస్యం జరిగిందని, ట్రిబ్యునల్ కోసం తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిందిస్తుంది. నెల క్రితమే సుప్రీంకోర్టు ఉప సంహరణకు అనుమతి ఇచ్చింది. ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణనే కారణం అని స్పష్టం చేశారు. ఇటీవల కేసీఆర్ నా పేరును ప్రస్తావించారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను చెబుతున్నాను. నన్ను నిందించడం సరైనది కాదని, తెలంగాణ ప్రభుత్వం లేటు చేస్తే బాధ్యత నాదా అని ప్రశ్నించారు.ఇద్దరు సీఎంల అంగీకారం తరువాతనే బోర్డుల పరిధిని నిర్ణయించాం అని వివరించారు మంత్రి షెకావత్.