ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పాలన సాగిస్తోందని వివరించింది. రాష్ట్రం మొత్తం కుప్పం వైపు చూసేల వైసీపీ అరాచకాలు చేస్తోందని వివరించారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో అధికారులు పాల్గొనడం మంచి పద్ధతి కాదన్నారు. కుప్పం లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ మాజీ మంత్రుల ను , ఎమ్మెల్యేలను, ,నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
కుప్పంకి రాకుండా నాయకులను ,కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టు లు చేయడం అడ్డుకోవడం కోసం చుట్టుపక్కల బారికేడ్లు ,చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకోవడం మరీ దారుణమని వెల్లడించారు. ప్రభుత్వం చివరికి చిన్న పిల్లల పాఠశాలలను కూడా వదలడం లేదని తమ పాఠశాలలను కాపాడండి అని రోడ్డుమీద కొచ్చిన విద్యార్థుల పైన పోలీసులతో దాడి చేయించడం ఏమిటని ప్రశ్నించారు, పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, పింఛన్ ఇవ్వలేదని, పింఛన్ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు..పేరుకు అంకెలు 56 కార్పొరేషన్లను పెట్టమని సంకలు గుద్దుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ లకు ఎంత నిధులు మంజూరు చేశారో తెలపాలని వివరించారు.