ప్రతి నెల మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఆ స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా పెన్షన్ ని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్ స్కీమ్ సౌకర్యం కల్పిస్తుంది. స్కీమ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే.. ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5వేల వరకు పెన్షన్‌ను తీసుకోవచ్చు. అయితే స్కీమ్‌లో ప్రతినెల మనం చెల్లించిన డబ్బును బట్టి పెన్షన్ వస్తుంది.
Advertisement
Advertisement
ఈ స్కీమ్‌కు సంబంధించిన అర్హులు ఎవరనేది చూసినట్టయితే దాదాపు 18 ఏండ్లు పైబడిన వారు 40 ఏండ్ల లోపు వయసు కలిగిన వారు మాత్రమే ఈస్కీమ్‌కు అర్హులు. బ్యాంకులో కానీ, పోస్టాపీస్‌లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు ఖాతా. సేవింగ్ ఖాతా ఆధార్‌తో లిక్ చేసుకుంటేనే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రతినెల నిర్ణిత మొత్తం 60 ఏండ్ల వరకు చెల్లించాలి. ఆ తరువాత నెల నెల డబ్బులు వస్తాయి. 18 ఏండ్ల వయస్సు ఉన్న వారు చేరినట్టయితే ఈ స్కీమ్‌లో రూ.42 నుంచి రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5000 పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారు చేరితే రూ.291 నుండి రూ.1454 వరకు చెల్లించాలి. 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రూ.5వేలు కావాలంటే రూ.210 నుంచి రూ.1318 పే చేయాలి. అప్పుడు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ స్కీమ్ చేరాలనుకునే వారు చేరేయండి.