ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బౌలర్ డ్వేన్ బ్రావో సరికొత్త రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డును రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
Advertisement
కరీబీయన్ ఆల్‌రౌండర్ బ్రావోకు ఐపీఎల్ కాస్త డిమాండ్ ఎక్కువే. అందుకే అతడి వయస్సు నాలుగు పదులకు చేరువవుతున్నా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం అతడిని అట్టిపెట్టుకునే ఉన్నది. ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో అతన్ని మరోసారి సొంతం చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర \సింగ్ ధోనీ తన మీద పెట్టుకున్ననమ్మకాన్ని బ్రావో వమ్ము చేయడం లేదు. బౌలింగ్‌లో వైవిద్యం చూపిస్తూ జట్టుఉ అవసరం అయినప్పుడల్లా వికెట్లు తీస్తూ.. చెన్నై విజయాల్లో తనవంతు పాత్రను చక్కగా పోషిస్తూ వస్తున్నాడు. బ్యాటింగ్‌లో చాలా ఆలస్యంగా వచ్చినా అవకాశం చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడి మంచి స్కోర్‌ను అందిస్తాడు.
Advertisement
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో బ్రావో మూడు వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును సమం చేసాడు. మలింగ తన ఐపీఎల్లో 170 వికెట్లు తీశాడు.
దీంతో లక్నోతో మ్యాచ్ ముందు వరకు నయా చరిత్ర సృష్టించేందుకు బ్రావో ఒక్కో వికెట్ దూరంఓ నిలిచాడు. ఐపీఎల్ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించుకునేందుకు అతనికి ఒక్క వికెట్ కావాలి. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దీపక్ హుడాను అవుట్ చేయడం ద్వారా బ్రావో ఐపీఎల్లో 171వ వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో కొత్త చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల జాబితా చూస్తే.. బ్రావో (171 వికెట్లు) మలింగ (170 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తరువాత అమిత్ మిశ్రా (166) పియూష్ చావ్లా (157),హర్భజన్ సింగ్ (150) లు ఉన్నారు.
Also Read : ఉత్కంఠ పోరులో చెన్నైని మట్టి కరిపించిన లక్నో సూపర్ జెయింట్స్