తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాసారు. ఇప్పటికే వడ్లు కొనుగోలులో రైతులు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు చేతికి వచ్చిన పంటకు నీరు మీరు అందించకుండా కరెంట్ కోతలు విధించడం సరికాదు అని పేర్కొన్నారు.
అవసరమనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి రైతాంగానికి మేలు చేయండి అని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారిగా 35 మిలియన్ యూనిట్లు రికార్డు నమోదు అయింది. 5 మిలియన్ యూనిట్లు కోత విధించారని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఉచిత హామీ ఇలా కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు.
Advertisement
Advertisement
మరొక వైపు ఎరువుల ధరల రేట్లను పెంచడం రైతులకు భారంగా మారుతుందని అన్నారు. 266 ఉన్న యూరియాపై 50 రూపాయలు పెంచారని.. 28-28-28 రూ. 1474 ఉండగా.. ఇప్పుడు 1900 చేసి ఏకంగా రూ.425 పెంచారని పేర్కొన్నారు. పోటాష్ ధర రూ.885 ఉండగా.. 1700 చేసి ఒకేసారి 815 పరుగులు పెంచారని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ కరెంట్ కోతలు విధిస్తూ.. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నేల తల్లిని నమ్ముకుని బ్రతికి ఉన్న రైతన్నలను ఇలా వేధించడం సరికాదని పేర్కొన్నారు. రైతన్నలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై వార్షిక ఇలా కక్ష సాధించడం న్యాయం కాదని లేఖలో వెల్లడించారు.