Home » ఒక సినిమాను మరో సినిమాతో పోల్చవద్దు…ఇవి ఎన్నికలు కాదు.. హీరో యష్ ఫైర్…!

ఒక సినిమాను మరో సినిమాతో పోల్చవద్దు…ఇవి ఎన్నికలు కాదు.. హీరో యష్ ఫైర్…!

by AJAY
Published: Last Updated on

కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్-2 ఏప్రిల్ 14 విడుదల కానుంది.

అయితే ఈ సినిమా కంటే ఒక రోజు ముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్టు సినిమా విడుదల కానుంది. అయితే ఈ రెండు సినిమాలను పోల్చవద్దు అని యష్ కోరారు. రాజకీయాల్లో పోలికలు ఉంటాయి కానీ సినిమాల్లో అలా పోల్చవద్ధని పేర్కొన్నారు. ఇది సినిమా రంగం….మనం రెండు సినిమాలను చుద్దాం….భారతీయ చిత్ర రంగంలో సంబురాలు చేసుకుందాం..అంటూ యష్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా యష్ చెప్పిన తరవాత అయినా అభిమానులు సైలెంట్ అవుతారా అన్నది చూడాలి.

Visitors Are Also Reading