ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ప్రమాణం చేయించారు. యోగి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎంగా నిలిచారు. ఐదేండ్ల కాలం పూర్తయిన తరువాత యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీలో అరుదైన రికార్డును దక్కించుకున్నాడు.
Advertisement
Advertisement
మరొక వైపు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ మౌర్య ఓడిపోయినప్పటికీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. దినేశ్ శర్మ స్థానంలో బ్రజేష్ పాఠక్ నియమించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. లక్నోలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాత్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు పలువురు హాజరయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 సీట్లతో భారీ విజయం సాధించింది.
Also Read : ఏపీలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల