ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుండగా.. చెన్నై అభిమానులకు మహేంద్రసింగ్ ధోని షాక్ ఇచ్చాడు. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అతని వారసుడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ సీజన్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు చెన్నై జట్టు ఓ ప్రకటలో పేర్కొంది.
ఐపీఎల్ ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చెన్నై జట్టుకు ధోని సారథిగా వ్యవహరించాడు. మధ్యలో రెండేండ్ల పాటు చెన్నై జట్టు నిషేదానికి గురైన విషయం విధితమే. మొత్తం 12 సీజన్లలో చెన్నైకి సారథిగా వ్యవహరించిన ధోని 4 సార్లు చెన్నైను ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు. అతని సారథ్యంలోనే చెన్నై 11 సార్లు ప్లే ఆప్స్‌కు చేరగా.. 9 సార్లు ఫైనల్ ఆడింది. ఐపీఎల్ 2020 సీజన్ మినహా అన్ని సీజన్‌లలో చెన్నై జట్టు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది.
Advertisement
Advertisement
చెన్నై జట్ట ధోని సారథ్యంలో 204 మ్యాచ్‌లు ఆడగా.. 121 విజయాలు సాధించింది. 82 మ్యాచ్‌లలో ఓడగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఐపీఎల్‌లో మహేంద్రుడి విజయాల శాతం 52.60గా ఉంది. మొత్తంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మహేంద్రుడు రెండుసార్లు ఛాంపియన్ లీగ్ కూడా గెలిచాడు. మెగా వేలానికి ముందు చెన్నై జట్టు మొదటి రిటెన్షన్ రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు రెండో రిటెన్షన్‌గా ఎమ్మెస్ ధోనీని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. మహేంద్రుడు ఐపీఎల్‌లో ఆడని ఆరు మ్యాచ్ లలో చెన్నైకి సురేష్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో చెన్నైకి మూడవ కెప్టెన్ గా రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆల్‌రౌండర్ జడేజా కెప్టెన్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాలి మరీ.
Also Read : IPL 2022 : తొలి మ్యాచ్‌లోనే ఆ రెండు టీమ్‌లకు ఎదురు దెబ్బ. ..!