Home » తూర్పు దేశాల వైపు ర‌ష్యా చూపు..!

తూర్పు దేశాల వైపు ర‌ష్యా చూపు..!

by Anji
Ad

ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య పేరుతో దండ‌యాత్ర చేస్తున్న ర‌ష్యాను ప్ర‌పంచ వేదిక‌పై ఒంట‌రిగా నిల‌బెట్టేందుకు ప‌శ్చిమ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక ఆంక్ష‌లు విధిస్తున్న అమెరికా స‌హా పాశ్చాత్య దేశాలు 1991 సోవియ‌ట్ యూనియ‌న్ ప‌త‌నం త‌రువాత ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాన్ని ర‌ష్యాకు గుర్తు చేయాల‌ని కృషి చేస్తున్నాయి. వీటిపై తాజాగా మ‌రొక‌సారి స్పందించిన ర‌ష్యా తాము పాశ్చాత్య దేశాల‌పై ఆధార‌ప‌డే ఆలోచ‌న‌ను ఎప్పుడో కోల్పోయామ‌ని ఇక‌పై అటువంటి భ్ర‌మ‌ల‌కు తావు లేద‌ని పేర్కొంది. ప్ర‌పంచంపై అమెరికా ఆధిప‌త్యాన్ని స‌హించేది లేద‌ని మ‌రొక‌సారి స్ప‌ష్టం చేసింది.

Advertisement

Advertisement

ప‌శ్చిమ భాగ‌స్వామ్య దేశాల‌పై ఏదో ఒక‌రోజు మేము ఆధార‌ప‌డ‌తామ‌ని భావిస్తే.. అటువంటి భ్ర‌మ‌ల‌కు ఇ క నుంచి తావు లేదు. ఇప్ప‌టికే ప‌శ్చిమ‌దేశాల‌పై అమెరికా ఆధిప‌త్యం ఎక్కువ అయింది. యూరోపియ‌న్ యూనియ‌న్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు శ‌క్తిహీనంగా మారింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ర‌ష్యా ఇక తూర్పు వైపు చూస్తుంద‌ని ర‌ష్యా అధికారిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ప్ర‌పంచ వేదిక‌పై ర‌ష్యాను ఒంట‌రి చేయాల‌ని ప‌శ్చిమ దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్న వేళ ఆయ‌న ఇలా స్పందించారు.

ప్ర‌పంచం కుగ్రామంగా ఉండ‌డం కాకుండా ఏక‌ధృవ ప్ర‌పంచాన్ని అమెరిక‌క‌న్లు కోరుకుంటున్నారు. చైనా, భార‌త్, బ్రెజిల్ వంటి దేశాలు ఎవ‌రో ఒక‌రూ ఇచ్చే ఆదేశాల‌ను పాటించాల‌ని కోరుకోవ‌డం లేదు. ఇక నుంచి భార‌త్‌, చైనా వైపు ర‌ష్యా చూస్తుంది. త‌మ‌పై తామే ఆధార‌ప‌డ‌డంతో పాటు త‌మ‌వైపు ఉండే మిత్ర ప‌క్షాల‌పైనే ఆధార‌ప‌డుతుంది. ఇప్ప‌టికీ ప‌శ్చిమ దేశాల‌కు మేము దారులు మూయ‌డం లేదు. వారే ఆ ప‌ని చేస్తున్నారు. ర‌ష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ పేర్కొన్నారు.

Also Read :  పుట్టిన‌రోజున గొప్ప‌మ‌న‌సు చాటుకున్న మోహ‌న్ బాబు…వారికి బంప‌రాఫ‌ర్..!

Visitors Are Also Reading