Home » ఇక చిల్ల‌ర స‌మ‌స్య‌కు తెలంగాణ ఆర్టీసీ చెక్‌..!

ఇక చిల్ల‌ర స‌మ‌స్య‌కు తెలంగాణ ఆర్టీసీ చెక్‌..!

by Anji
Ad

ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో చిల్ల‌ర స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ టీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. టికెట్ ధ‌ర‌ల్లో రౌండ‌ప్ విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త విధానం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ఉన్న ఛార్జీల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధ‌ర రూ.10 గా చేసింది. అలాగే రూ.13 రూ.14, ఉన్న టికెట్ ఛార్జీని రూ.15గా చేసారు. అలాగే 80 కిలోమీట‌ర్ల దూరానికి రూ.67గా ఉన్న రూ.65 వ‌సూలు చేయ‌నున్న‌ది.

ఇక టోల్ ప్లాజా ఛార్జీల‌ను త‌గ్గించుకునేందుకు ఆర్డిన‌రీ, హైటెక్ ఏసీ బస్సుల్లో ఛార్జీలను స్వ‌ల్పంగా పెంచింది. టోల్‌ప్లాజా ఛార్జీల కింద ఆర్డిన‌రీ బ‌స్సుల్లో రూ.1, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ బ‌స్సుల్లో రూ.2లు అద‌నంగా వ‌సూలు చేయ‌నున్నారు. ఈ ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి వ‌చ్చాయ‌ని.. ప్ర‌యాణికులు సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement

ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి స‌జ్జ‌నార్ సంస్థ‌ను గాడిలో పెట్టేందుకు త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్లుతున్నారు. ఆఫ‌ర్లు, ఫ్యాకేజీల‌తో ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. మ‌రొక‌వైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ప్ర‌యాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటే వెంట‌నే వాటిని ప‌రిష్క‌రిస్తూ టీఎస్ఆర్టీసీపై మ‌రింత న‌మ్మ‌కం పెరిగే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Also Read :  రిజిస్ట‌ర్ మ్యారేజ్.. కోర్టు వ‌ద్ద పూజాహెగ్దే హంగామా మామూలుగా లేదుగా..!

Visitors Are Also Reading