Home » రిజిస్ట‌ర్ మ్యారేజ్.. కోర్టు వ‌ద్ద పూజాహెగ్దే హంగామా మామూలుగా లేదుగా..!

రిజిస్ట‌ర్ మ్యారేజ్.. కోర్టు వ‌ద్ద పూజాహెగ్దే హంగామా మామూలుగా లేదుగా..!

by Anji
Ad

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ పూజాహెగ్దే గురించి తెలియ‌ని వారెవ్వ‌రూ లేరు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా ఓ రేంజ్‌లో దూసుకెళ్లుతుంది.

Advertisement

అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. చాలా వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు అందుకుంది. త‌న అందంతో ఎంతో మంది కుర్రాళ్ల‌ను ఆక‌ట్టుకుని వారిని అభిమానులుగా మార్చుకుంది. ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా క‌నిపిస్తోంది. తొలిసారిగా 2010లో సినీ ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ ఆమె నటించిన రెండ‌వ చిత్రం ఒక లైలా కోసం తొలుత విడుద‌ల అయింది.

వాస్త‌వానికి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా పూజాహెగ్దేను ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తారు. అలా వైకుంఠ‌పురంలో న‌టించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బుట్ట బొమ్మ ఆ త‌రువాత వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల్లో బిజీగా ఉంది. పాన్ ఇండ‌యా మూవీలో అవ‌కాశాలు అందుకుంటూ మంచి స‌క్సెస్‌లో దూసుకుపోతుంది. సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను వీడియోల‌ను బాగా షేర్ చేసుకుంటోంది. ప్ర‌తిరోజు ఏదో ఒక పోస్ట్‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది.

Advertisement


అప్పుడ‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్ లైవ్ కాల్ కూడా మాట్లాడుతూ.. ఉంఉటంది. ముచ్చ‌ట్లు బాగా పెడుతూ వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను చెబుతుంది. మొత్తానికి సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇదిలా ఉండ‌గా.. తాజాగా త‌న ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా కొన్ని స్టోరీస్ పంచుకుంది. అందులో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఫోటో దిగినట్టు క‌నిపించ‌గా ఆ ఫోటోని షేర్ చేసుకుంది.ఇక ఆ ఫోటో కోర్టు ద‌గ్గ‌ర దిగిన‌ట్టు క‌నిపించింది. ఈ ఫోటోను చూసిన నెటిజ‌న్లు తెగ లైక్‌ల‌తో పాటు కామెంట్లు కూడా పెడుతున్నారు. పూజా రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకుందా అంటూ ఫ‌న్నిగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి త‌న ఫోటోల‌తో పూజా హంగామా చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : వెద‌వ స‌న్నాసి, బ్లాక్ టికెట్లు అమ్మేటోడు….చిన‌జీయ‌ర్ పై నిర్మాత అశ్వినీద‌త్ ఫైర్..!

Visitors Are Also Reading