ఇండియాలో వాక్ స్వాతంత్య్రం ఉన్నా కూడా అది అన్ని విషయాలలో వర్తించదు. ఎంత పెద్దవారైనా కూడా నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందే. ఒకవేళ అలా చేయలేదంటే విమర్శలు తప్పువు. ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి కూడా అలాంటి తప్పు చేసే విమర్శలు ఎదురుకుంటున్నారు. చినజీయర్ స్వామి గతంతో మాట్లాడిన మాటలకు ఇప్పుడు తిప్పలు పడుతున్నారు.
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో భక్తితో కొలిచే సమ్మక్క సారలమ్మలను అసలు దేవుళ్లు కాదంటూ కొన్నేళ్ల క్రితం చినజీయర్ వ్యాఖ్యానించారు. అసలు వాళ్లు ఎవరు..వాళ్ల చరిత్ర ఏంది…సాధారణ ప్రజలు వెళితే పోనీ అనుకోవచ్చ..చదువుకున్న వాళ్లు కూడా అక్కడకు ఎక్కువగా వెళుతున్నారు. ఏకంగా ఆ పేర్లతో బ్యాంకులు కూడా పెట్టేస్తున్నారు అంటూ చినజీయర్ కామెంట్లు చేశారు.
Advertisement
అయితే ఈ వీడియో వచ్చి కొన్నేళ్లు అవుతుండగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో అప్పుడే వైరల్ అవ్వాల్సింది కానీ సోషల్ మీడియా ప్రభాస్ అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక చినజీయర్ వ్యాఖ్యలపై అటు రాజకీయ నాయకులు ఇటు సాధారణ ప్రజలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు కోట్ల మంది వస్తారు. అక్కడ దర్శనానికి ఒక్క రూపాయి కూడా తీసుకోరు…కానీ రీసెంట్ గా చినజీయర్ నిర్మించిన సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు డబ్బులు కట్టాలి..ఎవరు దోచుకుంటున్నారు అంటూ చినజీయర్ ను నిలదీస్తున్నారు.
ALSO READ : ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపను గుర్తు పట్టారా…ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్..!
ఈ అంశంపై ఎమ్మెల్యే సీతమ్మ చినజీయర్ పై ఫైర్ అయ్యారు. ఆయన వెంటనే ఆదివాసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై ఓ టీవీ ఛానల్ లో డిబేట్ జరుగుతుండా ప్రముక నిర్మాత అశ్వినీ దత్ చినజీయర్ పై ఫైర్ అయ్యారు. చినజీయర్ ఓ వెదవ…సన్నాసి ఒకప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మిన చరిత్ర ఉందంటారు అంటూ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా తాను మేడారం వెళ్లానని అక్కడ ఎంతో భక్తి శ్రద్దలతో దేవతలను కొలుస్తారని చెప్పారు.