Home » ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప‌ను గుర్తు ప‌ట్టారా…ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్..!

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప‌ను గుర్తు ప‌ట్టారా…ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో రానిస్తున్న న‌టీన‌టుల చిన్న‌ప్ప‌టి ఫోటోలను చూస్తే మాత్రం మ‌నం అస్స‌లు గుర్తు ప‌ట్టలేం. కానీ కొంద‌రిని మాత్రం ఈజీగా గుర్తుప‌ట్టేయ‌వ‌చ్చు. కింద క‌నిపిస్తున్న ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది. చూడ్డానికి తెలుగ‌మ్మాయిలా క‌నిపిస్తూ మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. అంతే కాకుండా మొద‌టి సినిమా ఈ అమ్మ‌డు మెగా హీరో ప‌క్క‌న చేయ‌డం విషేశం.

Advertisement

అంతే కాకుండా మ‌రో మెగా హీరోతో చేసిన సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయ‌ని్ రేంజ్ కు ఎదిగిపోయింది. ప్ర‌స్తుతం తెలుగు త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ తో ఓ సినిమా చేసింది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. మ‌రోవైపు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో ఓ సినిమాలో న‌టించింది. ఈ సినిమా విడుద‌ల కు సిద్దంగా ఉంది.

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి ఓ పాట‌ను విడుద‌ల చేయ‌గా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ త‌న వాకింగ్ స్టైల్ తో ఎంతో మంది కుర్రాళ్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తోంది. బుట్ట‌బొమ్మ లాంటి అందంతో బుట్ట‌బొమ్మ‌గా ఇండ‌స్ట్రీలో పేరు సంపాదించుకుంది. ఇక ఈ హీరోయిన్ ఆడియో ఫంక్ష‌న్ ల‌లో ఎంతో క్యూట్ గా తెలుగు మాట్లాడుతూ ఆక‌ట్టుకుంటోంది.

అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే ఈ బుట్ట‌బొమ్మ హాట్ అందాల‌తో యూత్ మ‌దిని దోచేస్తుంది. రీసెంట్ గా కుటుంబంతో క‌లిసి మాల్దీవుల టూర్ కు కూడా వెళ్లింది. అక్క‌డ అందాల విందుతో ఫోటో షూట్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా అభిమానుల హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో మీకు ఇప్ప‌టికే అర్థం అయ్యి ఉంటుంది.

Visitors Are Also Reading