ఐసీసీ మహిళ ప్రపంచ కప్ 2022లో భారత జట్టు ఫీల్డింగ్ ఇప్పటివరకు చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ మిథాలీ రాజ్ జట్టు ఫీలింగ్ పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జట్ట ఫీల్డింగ్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన బంతికి అమీజోన్స్ భారీ షాట్ ఆడింది. హర్మన్ అద్భుతంగా క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
Advertisement
ముఖ్యంగా క్యాచ్ పట్టే సమయంలో హర్మన్ తలకిందులుగా పడిపోయింది. అయినా బాల్‌ను మాత్రం వదలలేదు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చాలా పేలవంగా ఉండడంతో ఓటమిపాలు అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన 35, రిచా ఘోష్ 33 పరుగులు చేశారు. వీరిద్దరూ కాకుండా ఝలన్ గోస్వామి 20 పరుగులు సాధించారు. మిగిలిన వారు మాత్రం ఇంగ్లండ్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు.
అనంతరం ఇంగ్లండ్ 31.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. రెండవ సారి ఓటమి పాలైంది. సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ తదుపరి 3 మ్యాచ్‌ల్లో 2 గెలవాల్సి ఉంది. ఈ ప్రపంచకప్ తొలిమ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడాల్సి ఉండగా.. నాలుగో మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Also Read : IPL 2022 : ఐపీఎల్ బయోబబుల్ కొత్త నిబంధనల గురించి మీకు తెలుసా..?