Ad
మార్చి 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసీసీఐ అందుకోసం కఠినమైన బయోబబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కరోనా విజృంభణతో గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదు అని హెచ్చరించింది.
Advertisement
Advertisement
- ఏ ఆటగాడైనా తొలిసారి బుడగ దాటితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండవ సారి ఉల్లంఘనకు పాల్పడితే మ్యాచ్ నిషేదం, మూడోసారి బుడగ దాటితో ఏకంగా లీగ్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అలాంటి పరిస్థితి ఎదురైతే ప్రత్యామ్నాయ ఆటగాడిని సైతం అనుమతించం అని పేర్కొన్నది.
- బయోబబుల్ నిబంధనలు ప్రాంఛైజీలు, ఆటగాళ్ల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని బీసీసీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ( ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజుల క్వారంటైన్లో గడపాలి) ఉండాలి. రెండో సారి ఉల్లంఘిస్తే బుడగ నుంచి తొలగిస్తామని బీసీసీఐ వివరించింది.
- కరోనా పరీక్షకు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. ఇక రెండవ సారి కూడా నిరాకరిస్తే రూ.75 వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతించబోమని వెల్లడించింది.
Also Read : రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా చాహల్..!