ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కావడానికి మరొక పది రోజులే ఉన్నది. ఈ తరుణంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథిగా సంజూశాంసన్‌ను తప్పించి టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌ను నూతన కెప్టెన్ గా నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఫ్రాంచైజీ. అయితే ఇక్కడే ఉందని అసలైన ట్విస్ట్.. ఈ కెప్టెన్సీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కాదు. అల్లరి చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యజ్వేంద్ర చాహల్.
Advertisement
Advertisement
ఆర్ఆర్ జట్టు అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను యజ్వేంద్ర చాహల్ హ్యాక్ చేసాడు. ఇక నుంచి తానే జట్టుకు కొత్త కెప్టెన్ అని ప్రకటించుకున్నాడు. హ్యాక్ చేసిన విషయాన్ని కూడా చాహాల్ తన ట్విట్టర్ వేదికగా చెప్పాడు. అంతటితో ఆగకుండా తాను బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. 10వేల రీ ట్వీట్ వస్తే జోస్ బట్లర్ అంకుల్‌తో కలిసి ఓపెన్ చేస్తానని మరొక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. చాహాల్ ట్వీట్‌కు రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సరదాగా కంగ్రాట్స్ తెలిపాడు.
చాహల్ చేసి ఈ ట్వీట్‌ను చూసి అభిమానులు షాక్ అయ్యారు. కానీ కొందరూ మాత్రం ఇది చాహల్ పనే అయి ఉంటుందని గ్రహించారు. రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విట్టర్‌ను హ్యాండిల్ చేసే వ్యక్తి నుంచి పాస్ వర్డ్ తీసుకున్న చాహల్.. ఈ పని చేశాడు. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్ వేదికగా పాస్వర్డ్ ఇచ్చిన వ్యక్తికి ధన్యవాదాలు కూడా తెలిపాడు. జట్టు యజమాన్యానికి తెలిసే ఇలా చేసి ఉంటాడు అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.