Home » జీహెచ్ఎంసీ బ‌డ్జెట్ రూ.550 కోట్లు పెంపు

జీహెచ్ఎంసీ బ‌డ్జెట్ రూ.550 కోట్లు పెంపు

by Anji
Ad

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ గ‌త ఏడాదితో పోలిస్తే రూ.550 కోట్ల బ‌డ్జెట్‌ను పెంచింది. 2021-22 బ‌డ్జెట్ కేటాయింపులు రూ.5,600 కోట్లు కాగా.. 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను రూ.6,150 కోట్ల‌కు పెంచారు. కార్పొరేష‌న్ ముసాయిదా వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.6,150 కోట్ల‌ను బుధ‌వారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ముందు ఉంచ‌గా.. బ‌డ్జెట్ కు ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంద‌ని జీహెచ్ఎంసీ అధికారులు, క‌మిటీ స‌భ్యులు వెల్ల‌డించారు. స‌వ‌రించిన బ‌డ్జెట్ అంచ‌నా 6,300 కోట్ల రూపాయ‌ల‌కు పెరిగింది. ఆర్బీఈ ఆమోదం కోసం క‌మిటీ ముందు ఉంచ‌బ‌డుతుంది.

Advertisement

ముసాయిదా బ‌డ్జెట్ ప్ర‌కారం.. తెలంగాణ డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్ కింద 2 బీహెచ్కే ఇండ్ల నిర్మాణానికి కేటాయింపులు రూ.1,241.33 కోట్లు త‌గ్గాయి. చాలా యూనిట్లు ఇప్ప‌టికే నిర్మించ‌బ‌డ్డాయ‌ని అధికారులు వివ‌రించారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌రువాత ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తామ‌ని ఇటీవ‌ల మున్సిప‌ల్ ప‌రిపాల‌న, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు.

Advertisement


2022-23 లో ఇండ్ల నిర్మాణానికి రూ.406.70 కోట్లు కేటాయించారు. రాబోయే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆరోగ్యం, పారిశుధ్యం, ర‌హ‌దారి మౌలిక స‌దుపాయాలు, నాలాల కోసం సింహ‌భాగం కేటాయించారు. రూ.6,150 కోట్ల బ‌డ్జెట్లో రోడ్ల మౌలిక స‌దుపాయాలు, పారిశుధ్యం, ప‌చ్చ‌ద‌నం, డ్రైన్‌లు, పేవ్ మెంట్ల నిర్మాణం ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు మూల‌ధ‌న వ్య‌యం 3,350 కోట్లు కాగా.. ఆదాయం రూ.3,434 కోట్లుగా ఉంది. 2022-23లో జీహెచ్ఎంసీ ఆస్తిప‌న్ను ద్వారా రూ.1,700 కోట్లు, భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు ఇత‌ర ఆదాయ ఉత్పాద‌క కార్య‌క‌లాపాల ద్వారా 1,200 కోట్లు వ‌సూలు చేయాల‌ని భావిస్తోంది.

Also Read :  జ‌పాన్‌లో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 7.3 న‌మోదు

Visitors Are Also Reading