Home » ఇండియాలో త్వ‌ర‌లో ఫోర్త్ వేవ్…75శాతం మందిపై ప్ర‌భావం…?

ఇండియాలో త్వ‌ర‌లో ఫోర్త్ వేవ్…75శాతం మందిపై ప్ర‌భావం…?

by AJAY
Ad

ఇప్పుడిప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ త‌గ్గ‌టంతో భారతీయులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్ర‌తిరోజూ న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య భారీగా త‌గ్గ‌టంతో క‌రోనా అంతం అయిపోయింద‌ని అనుకుంటున్నారు. రాష్ట్రాల‌లో అన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేశారు. స్కూల్లు, సినిమా హాల్లు అన్నీ తెరుచుకున్నాయి. ఇలాంటి స‌మయంలో ఫోర్త్ వేవ్ హెచ్చ‌రిక‌లు షురూ అయ్యాయి. భార‌త్ లో థ‌ర్డ్ వేవ్ దాదాపుగా పూర్త‌య్యింది. నిపుణులు హెచ్చ‌రించినంత‌గా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చూపించ‌లేదు.

Advertisement

corona omricon

corona omricon

దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఫోర్త్ వేవ్ మాత్రం 75శాతం మంది ప్ర‌జ‌లపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా పుట్టినిల్లు చైనాలో మ‌హ‌మ్మారి విజృంభణ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్ర‌తిరోజూ వేల‌ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. దాంతో ప‌లు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే లాక్ డౌన్ కూడా విధించారు. దాంతో త్వ‌ర‌లోనే ఇండియాలోనూ క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు 18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading