మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో మధ్యం షాపుల రిజర్వేషన్ కేటాయింపు డ్రా లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ధిక వనరులు మెరుగు పరచడానికే మధ్యం షాపుల్లో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో 2620 షాపుల్లో గౌడ్లకు 363, ఎస్పీలకు 262, ఎస్టీలకు 131షాపులు ఇస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ధరలు పెంచకపోగా షాపుదారులకు అనేక వెసులుబాట్లు తీసుకొచ్చామని తెలిపారు.
Advertisement
Advertisement
పారదర్శకంగా షాపుల కేటాయింపు ఉంటుంది అన్నారు. రాష్ట్రంలో గుడంబా, గాంజ, మత్తపదార్దాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం.. ఎలాంటి వారిపైనైనా పీడీ కేసులు పెడతాం అని హెచ్చరించారు. కల్తీమద్యం లేకుండా చూస్తాం అని మంత్రి స్పష్టం చేసారు. భవిష్యత్‌లో కాంట్రాక్టులు, మెడికల్ షాపుల కేటాయింపుల్లో కూడ రిజర్వేషన్‌ను అమలు చేసే అంశం పరిశీలనలో ఉంది అని అన్నారు.