తన భార్య ఆడది కాదంటూ ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని ఓ భర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేసాడు. 2016లో తమకు వివాహం అయిందని. ఆమె రుతుక్రమం కారణంగా తనకు దూరంగా ఉందని, అనంతరం ఆమె తన వద్దకు తిరిగి వచ్చిందని పిటిషన్లో భర్త పేర్కొన్నాడు.
ఆమెతో సన్నిహితంగా మెలిగే సమయంలో తనకు దూరంగా ఉండడంతో అనుమానం వచ్చిందని, దీంతో ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లగా ఇంపర్ ఫోరెట్ హైమన్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారని సదరు వ్యక్తి పిటిషన్లో కోర్టుకు నివేదించాడు. ఆ పురుషాంగాన్ని ఆపరేషన్‌లో తొలగించవచ్చు అని. దాదాపు పిల్లలు పుట్టరు అని వైద్యులు నిర్ధారించినట్టు తెలిపాడు. దీంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి కుమార్తెను తిరిగి తీసుకెళ్లానని చెప్పానని, అయితే తన కుమార్తెతో కాపురం చేయాలని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మామ బెదిరించినట్టు ఆరోపించాడు.
Advertisement
Also Read : ఏపీ స్పీకర్‌కు గంటా శ్రీనివాసరావు లేఖ.. ఎందుకంటే..?
Advertisement
చివరికీ పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులు కోరుతూ మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించినట్టు వివరించాడు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన కోర్టు కేవలం మౌఖిక సాక్షం ఆధారంగా మెడికల్ సాక్షం లేకుండా చీటింగ్ చేసారని చెప్పడం సాధ్యపడదు అంటూ అతని పిటిషన్‌ను కొట్టేసింది. మహిళలకు ఉండాల్సిన లక్షణాలు, అవయవాలు ఉన్నందున ఇందులో మోసమేమి లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఐపీసీ ప్రకారం.. భార్య పురుషుడిగా మారినందుకు ఆమెపై సెక్షన్ 420 కింద క్రిమినల్ నేరం చేసినట్టు పరిగణించాలని భర్త తరపు లాయర్ ఎన్కే మోడీ ధర్మసనానికి తెలియజేశారు. ఆమె మహిళ కాదు బాధితుడికి కచ్చితంగా అన్యాయం జరిగిందన్నారు. పుట్టుకతో వచ్చే సమస్య కాదు అని, ఆమెకు తన జననాంగాల గురించి తెలిసి తన క్లయింట్‌ను ఉద్దేశ పూర్వకంగా మోసం చేసినట్టు కోర్టుకు విన్నవించారు. కేసుపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భార్య, ఆమె తండ్రి మధ్య ప్రదేశ్ పోలీసులకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Also Read : PSPK ఖుషి సినిమా… 10 GIF Images లో!