ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో వైసీపీకి ధీటుగా టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ తరుణంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు సోమవారం లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో స్పీకర్ ను కోరారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఫిబ్రవరి 21న ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసారు. అయితే ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో స్పీకర్‌కు లేఖ రాశారు. ఇప్పటివరకు రాజీనామా ఆమోదించి కపోవడం సరైంది కాదు అని.. నా రాజీనామా ఉద్యమానికి బలం చేకూరుతుందని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను అని రాజీనామా కార్మిక సోదరులకు ఉపయోగపడుతుందని గంటా పేర్కొన్నారు.
Advertisement
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని గత ఏడాది కేంద్రప్రభుత్వం ప్రకటించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం రేగిన సంగతి తెలిసిందే విశాఖలో స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్న వారితో పాటు కార్మిక సంఘాలు, రాజకీయాల పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ తరుణంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లోనే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో అసెంబ్లీకి పంపారు. రాజీనామా చేసి ఏడాది అయినా ఆమోదించకపోవడంతో ఆయన లేఖ రాసారు.
Also Read : IND Vs SL : ఫామ్‌ను కోల్పోయిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తరువాత 50 దిగువన సగటు..!