Home » అప్ప‌ట్లో మా టీచ‌ర్లు…. ఈ పాఠం చెప్ప‌డ‌మే ఎగ‌ర‌గొట్టేవారు!

అప్ప‌ట్లో మా టీచ‌ర్లు…. ఈ పాఠం చెప్ప‌డ‌మే ఎగ‌ర‌గొట్టేవారు!

by Azhar
Ad

నేను 8వ త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు….మాకు బ‌యాల‌జీలో ప్ర‌త్యుత్ప‌త్తి అనే పాఠం ఉండేది. అందులో రుతుచ‌క్రం గురించి కూడా ఉండేది. మాది కో ఎడ్యుకేష‌న్ పైగా బ‌యాల‌జీ చెప్పేది లేడీ టీచ‌ర్….. బ‌యాల‌జీ స‌బ్జెక్ట్ ను ఒక ఆట ఆడుకునే మా టీచ‌ర్ … ఆ టాపిక్ వ‌చ్చే స‌రికి జ‌స్ట్ చ‌దువుకుంటూ వెళ్లేది…. ఆ త‌ర్వాత నోట్స్ రాయించి సిల‌బ‌స్ కంప్లీట్ అనేది. మాకు ఎన్నో డౌట్స్ ఉన్న‌ప్ప‌టికీ ఆ టాపిక్ మీద ఒక్క డౌట్ కూడా అడిగేవాళ్లం కాదు….కార‌ణం బాయ్స్ ఏమ‌నుకుంటారో అని! బ‌హుషా టీచ‌ర్ కు కూడా అదే ప్రాబ్ల‌మ్ కావొచ్చు అబ్బాయిల ముందు ఈ సున్నిత‌మైన అంశాలు చెప్ప‌డం ఎందుకులే అనుకొని ఉండోచ్చు!

Advertisement

Advertisement

ఇంట‌ర్ లో Bipc తీసుకున్నాను…. అక్క‌డే ఇదే చాప్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు నా 8వ త‌ర‌గ‌తి రోజులు గుర్తుకొచ్చాయి. ఇదే విష‌యాన్ని నా ఫ్రెండ్ తో డిస్క‌స్ చేశాను …..అత‌డు త‌న అనుభ‌వాన్ని చెప్పుకొచ్చాడు. వాళ్ల‌దీ కో ఎడ్యుకేష‌న్ యే న‌ట‌….వాళ్ల బ‌యాల‌జీ సార్ కూడా ఆ చాప్ట‌ర్ ను తూతూ మంత్రంగా చెప్పేశాడ‌ట‌! దానికి కార‌ణం క్లాసులో ఉన్న అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారోన‌ని,అబ్బాయిలు ఎక్క‌డ ఆట ప‌ట్టిస్తారోన‌ని!

విచిత్రం ఏంటో తెలుసా? ….. రుతుచ‌క్రం స్టార్ట్ అయ్యేది ఆ ఏజ్ లోనే…అప్పుడే వారికి చెప్పాల్సిన విష‌యాలు చెప్ప‌కుండా వారికి అర్థం చేయించాల్సిన విష‌యాల‌ను వివ‌రించ‌కుండా రుతుచ‌క్రాన్ని ఏదో బూతుగా భావించ‌డ‌మే చాలా మంది టీచ‌ర్లు చేసిన త‌ప్పు! మ‌రి ఇప్పుడైనా ఆ టీచింగ్ లో మార్పు వ‌చ్చిందా? ఇంకా రీ ప్రొడ‌క్ష‌న్ సిస్ట‌మ్ టాపిక్ ను చాప చుట్టేస్తున్నారా? మీరే చెప్పాలి.!!

Also Read: ఇంత వ‌ర‌కు సినిమాల్లో త‌న ఎడ‌మ‌చేయి చూపించ‌ని హీరోయిన్! ఎందుకిలా?

Visitors Are Also Reading