Home » ర‌ష్యాకు షాక్ ఇచ్చిన చైనా.. ఎందుకో తెలుసా..?

ర‌ష్యాకు షాక్ ఇచ్చిన చైనా.. ఎందుకో తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

ఉక్రెయిన్‌తో యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యాపై ప్ర‌పంచ దేశాల ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా, ఐరోపా దేశాలు ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించ‌గా ఆసియా దేశాలు అంత‌గా స్పందించ‌లేదు. యుక్రెయిన్ పై ర‌ష్యా దాడులు ఆప‌క‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో ర‌ష్యాకు మ‌ద్ద‌తిస్తున్న దేశాల‌పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ర‌ష్యాకు మిత్ర దేశాలు అయిన‌టువంటి భార‌త్‌, చైనాలు ర‌ష్యాను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయడం లేదంటూ అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దంలో ఇప్ప‌టివ‌ర‌కు ప్రేక్ష‌క‌పాత్ర పోషించిన చైనా కూడా ర‌ష్యాపై పాక్షిక ఆంక్ష‌ల‌కు సిద్ధమైంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌ష్యాకు విమాన పరిక‌రాల స‌ర‌ఫ‌రాను చైనా నిలిపేసింది.

Advertisement


దీంతో ర‌ష్యాపై ఆంక్ష‌లు విధిస్తున్న ప‌శ్చిమ‌దేశాల స‌ర‌స‌న చైనా కూడా చేరిట్ట‌యింది. ర‌ష్యాకు చైనా విమ‌మాన ప‌రికరాల స‌ర‌ఫ‌రా నిలిపివేత రోసావియాట్సియా (ర‌ష్యా) ఎయిర్ క్రాప్ట్ ఎయిర్ వ‌ర్తినెస్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారి వాలెరీ కుడినోవ్ స్పందిస్తూ.. ర‌ష్యాలోని విమాన‌యాన సంస్థ‌లు త‌మ సంస్థ‌ల త‌రుపున ప్ర‌త్య‌కంగా చైనా సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుకోవాల‌ని సూచించారు. ర‌ష్యాకు చైనా విమాన ప‌రికరాలు నిలిపివేత‌తో ర‌ష్యా విమాన‌యాన సంస్థ‌ల దృష్టి ఇప్పుడు భార‌త్ లేదా ట‌ర్కీ దేశాల‌పై ప‌డ‌నున్న‌ది. యూరోప్ దేశాలు సైతం విమాన విడిభాగాల స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డంతో ర‌ష్యా ఇక‌పై భార‌త్ పైనే ఆధార‌ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Advertisement

వాలెరీ కుడినోవ్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ర‌ష్యాకు చెందిన ఫెడ‌రల్ ఎయిర్ ట్రాన్స్‌ఫోర్ట్ ఏజెన్సీ స్పందిస్తూ.. ఆయ‌న‌కు ప్ర‌క‌ట‌న‌లు చేసే అధికారం లేద‌ని పేర్కొంది. వాలెరీ కుడినోవ్ త‌న ఆధీనంలోని ఎయిర్ క్రాప్ట్ ఎయిర్ వ‌ర్తినెస్ మెయింటెనెన్స్ డిపార్టుమెంట్ అధికారిక ప‌నులు చ‌క్క‌బెట్ట‌డ‌మే ఆయ‌న‌కిచ్చిన విధుల‌ను ఫెడ‌ర‌ల్ ఎయిర్ ట్రాన్స్‌ఫోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. అయితే చైనా వాస్త‌వంగా ర‌ష్యాపై ఆంక్ష‌ల‌కు దిగిందా..? ముడి స‌రుకు ఇబ్బందుల కార‌ణంగా విమాన ప‌రిక‌రాల స‌ర‌ఫ‌రా నిలిపివేసిందా అనే ప్ర‌శ్న తెలెత్తుతోంది. ర‌ష్యా-చైనా దేశాలు దౌత్యప‌రంగా ఎంతో ద‌గ్గ‌రి సంబంధాలు క‌లిగి ఉన్నాయ‌నే విష‌యం తెలిసిందే.

Visitors Are Also Reading