Home » Russia-Ukraine War: ర‌ష్యాకు ఎదురు దెబ్బ‌.. ఐఓసీ బ‌హిష్క‌ర‌ణ వేటు..!

Russia-Ukraine War: ర‌ష్యాకు ఎదురు దెబ్బ‌.. ఐఓసీ బ‌హిష్క‌ర‌ణ వేటు..!

by Anji
Ad

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న ర‌ష్యాపై ఆంక్ష‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. పిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2022 నుంచి ర‌ష్యా పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ (ఐఓసీ) అన్ని అంత‌ర్జాతీయ టోర్నీల నుంచి ర‌ష్యాను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. త‌దుప‌రి నోటీసు వ‌చ్చే వ‌ర‌కు ఈ నిర్ణ‌యం అమ‌లులో ఉంటుంద‌ని వెల్ల‌డించింది. దీంతో ర‌ష్యాకు క్రీడ‌ల‌ప‌రంగానూ భారీ దెబ్బ త‌గిలిన‌ట్టు అయింది. అంత‌ర్జాతీయ టోర్నీల్లో ర‌ష్య‌న్ జ‌ట్ల‌ను అనుమ‌తించొద్ద‌ని అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ స్ప‌ష్టం చేసింది.

Advertisement

అంతేకాదు.. ర‌ష్యాకు మ‌ద్ద‌తు తెలుపుతున్న బెలార‌స్ అథ్లెట్ల‌ను కూడా బ‌హిష్క‌రించాల‌ని పేర్కొంది. ఆ రెండు దేశాల‌కు చెందిన అథ్లెట్ల‌ను టోర్న‌మెంట్‌ల‌లో ఆడ‌కుండా చేయాల‌ని స‌మావేశంలో ఐవోసీ నిర్ణ‌యం తీసుకుంది. ర‌ష్యా, బెలార‌స్ పై ఎందుకు బ‌హిష్క‌ర‌ణ‌లు వేటు వేయాల్సి వ‌చ్చింది వివ‌రిస్తూ.. ప్ర‌పంచ క్రీడా పోటీల స‌మ‌గ్ర‌త‌ను కాపాడేందుకు క్రీడాకారుల భ‌ద్ర‌త కోసం ఈ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐఓసీ పేర్కొంది. ఉక్రెయిన్ పై దాడితో బ‌రువెక్కిన హృద‌యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించింది.

Advertisement

అంత‌ర్జాతీయ పోటీల్లో పోటీల్లో ర‌ష్య‌న్ బెలార‌స్ అథ్లెట్లు అధికారుల‌ను ఆహ్వానించ‌వ‌ద్ద‌ని లేదా అనుమ‌తించ‌వ‌ద్ద‌ని అంత‌ర్జాతీయ క్రీడా స‌మాఖ్య‌లు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వాహ‌కుల‌కు ఐవోసీ సిఫార్సు చేసింది. అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు మ‌రొక‌సారి చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకుంది. సంస్థాగ‌త లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల చిన్న నోటీసుతో ఇది సాధ్యం కాన‌ప్పుడు అంత‌ర్జాతీయ క్రీడా స‌మాఖ్య‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా ఈవెంట్‌ల నిర్వాహ‌కుల‌ను ర‌ష్యా లేదా బెలార‌స్ నుంచి ఏ అథ్లెట్ లేదా స్పోర్ట్స్ అధికారిని అనుమ‌తించ‌కుండా చూడాల‌ని కోరింది. ర‌ష్య‌న్ లేదా బెలార‌సియ‌న్ జాతీయులు, అది వ్య‌క్తులు లేదా జ‌ట్లుగా త‌ట‌స్థ క్రీడాకారులు లేదా త‌ట‌స్థ జ‌ట్టుగా మాత్ర‌మే అంగీక‌రించ‌బ‌డాలి. జాతీయ చిహ్నాలు, రంగులు, జెండాలు లేదా గీతాలు ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌కూడ‌ద‌ని ఐఓసీ స్ప‌ష్టం చేసింది.

Also Read :  Shane Warne : షేన్ వార్న్ అంత్య‌క్రియ‌ల‌కు తేదీ ఖ‌రారు..!

Visitors Are Also Reading